Category : సినిమా | Sub Category : సినిమా Posted on 2025-04-12 10:47:39
తెలుగు వెబ్ మీడియా న్యూస్:-జయాపజయాలతో సంబంధం లేకుండా రవితేజవరుసగా సినిమాలైతే చేస్తున్నాడు కానీ వాటికి మంచి ఆదరణ మాత్రం దక్కడం లేదు. కరోనా టైమ్ లో గోపీచంద్ మలినేనితో చేసిన క్రాక్తో సాలిడ్ హిట్ అందుకున్న రవితేజ ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేస్తే వాటిలో ధమాకా ఒక్కటే హిట్ అయింది. మిగిలినవన్నీ డిజాస్టర్లు, ఫ్లాపులుగానే నిలిచాయి.దీంతో తనకు క్రాక్ లాంటి సూపర్‌హిట్ ఇచ్చిన గోపీచంద్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్బ్యానర్ లో ఓ సినిమాను అనౌన్స్ చేశాడు రవితేజ. కానీ బడ్జెట్ ఇష్యూస్ వల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత రవితేజ ప్లేస్ లోకి బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ వచ్చాడు. గదర్2 తర్వాత సన్నీ డియోల్ నుంచి వస్తున్న సినిమా కావడంతో జాట్కు మంచి హైప్ వచ్చింది.మంచి అంచనాల మధ్య రిలీజైన జాట్ కు నార్త్ లో పాజిటివ్ టాకే వచ్చింది. సౌత్ సినిమాలకు అలవాటు పడిన నార్త్ ఆడియన్స్ జాట్ ను చూసి ఇంప్రెస్ అయ్యారు. దీంతో రవితేజ అనవసరంగా ఓ మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడంటున్నారు. అయితే ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం ఒకటుంది. రవితేజ ఆ సినిమా చేద్దామనుకున్నప్పటికీ బడ్జెట్ కారణంగా నిర్మాతలే దాన్ని ఆపేశారు. ఇక రెండో విషయం రవితేజ అలాంటి సినిమాలు చాలానే చేశాడు కాబట్టి ఒకవేళ జాట్ రవితేజ చేసినా పెద్ద కొత్తగా ఏమీ అనిపించదు. సో, జాట్ కు సన్నీడియోలే బెస్ట్.