Responsive Header with Date and Time

హైదరాబాద్ రైల్ కింద పడి బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు.. హైదరాబాద్ లోని విద్యానగర్ సమీపంలో చోటు చేసుకుంది..

Category : | Sub Category : క్రైమ్ Posted on 2024-01-19 16:18:29


హైదరాబాద్ రైల్ కింద పడి బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు.. హైదరాబాద్ లోని విద్యానగర్ సమీపంలో చోటు  చేసుకుంది..

అంబర్పేట: రైలు కింద పడి ఓ బాలుడు (16) ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ లోని విద్యానగర్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాచిగూడ రైల్వే ఇన్స్పెక్టర్ ఎల్లప్ప తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం అర్ధరాత్రి విద్యానగర్- జామియా ఉస్మానియా స్టేషన్ల మధ్య బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడిని అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక, యువతిపై కత్తితో దాడికి పాల్పడిన బాలుడిగా గుర్తించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..

ప్రేమ పేరుతో బాలిక (16)ను బాలుడు (16) కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఫోన్లో సందేశాలు పెట్టడమే కాకుండా వెంటపడి ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. బాలిక ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో ట్యూషన్కు వెళ్లిన ఆమెను కత్తితో పొడిచి దారుణానికి తెగబడ్డాడు. అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు తూర్పు మండలం డీసీపీ సాయిశ్రీ కథనం ప్రకారం... బాన్అంబర్పేట తురాబ్నగర్లో ఉండే బాలిక, బాలుడు ఒకే పాఠశాలలో పదో తరగతి చదువుకున్నారు. బాలిక తల్లి స్థానికంగా టైలరింగ్ పనిచేసేది. ఆమె ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. టైలరింగ్ సామగ్రిని బాలుడి కుటుంబీకులు కొనుగోలు చేశారు. తన పెద్దమ్మ కూతురు వద్దకు బాలిక గురువారం సాయంత్రం ట్యూషన్కు వెళుతోంది. ఆ సమయంలో వెంటపడి వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. రాత్రి 7.30 సమయంలో ట్యూషన్లో కి వెళ్లి బాలికను కత్తితో పొడిచాడు. అట్టొచ్చిన ఆమె పెద్దమ్మ కూతురును పొడిచి గాయపర్చాడు...

కత్తిని అక్కడే పడేసి పరారయ్యాడు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత బాలుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

Search
Categories
తాజా వార్తలు
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: