Responsive Header with Date and Time

తెలంగాణ సర్కారులో 1049 రిటైర్డ్ ఉద్యోగులు..... ఏటా 1800 కోట్ల ఖర్చు......

Category : | Sub Category : తాజా వార్తలు Posted on 2024-01-19 12:59:14


తెలంగాణ సర్కారులో 1049 రిటైర్డ్ ఉద్యోగులు..... ఏటా 1800 కోట్ల ఖర్చు......

TWM Live News :-   తెలంగాణ ప్రభుత్వంలోని ఆయా శాఖల్లో రిటైర్ అయినా ఇంకా విధుల్లో కొనసాగుతున్నవారి వివరాలు సేకరించాలని సీఎస్ శాంతి కూమారి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో.. అధికారులు అన్ని శాఖల నుంచి వివరాలు సేకరించి.. నివేదికను సీఎస్‌కు సమర్పించారు. కాగా...... అన్ని శాఖల్లో కలిపి మొత్తం 1049 మంది రిటైర్డ్ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నట్టు అధికారులు తేల్చారు.


  • అన్ని శాఖ‌ల్లో క‌లిపి రిటైర్డ్ ఉద్యోగుల సంఖ్య 1049....
  • అత్యధికంగా మున్సిప‌ల్ శాఖ‌లో 179 మంది...
  • వారిపై ప్రభుత్వం ఏటా 1800 కోట్ల ఖర్చు చేసినట్టు అంచనా....



తెలంగాణలో పదవీ విరమణ చేసిన అధికారులు రీ అపాయింట్‌మెంట్, ఎక్స్‌టెన్షన్ పేరుతో ఆయా శాఖల్లో ఇంకా ఉద్యోగాలు చేస్తున్న వారి వివరాలు ఇవ్వాలని సీఎస్ శాంతి కుమారి ఆదేశించగా.. ఆయా శాఖల కార్యదర్శులు నివేదిక సమర్పించారు. ఈ మేరకు.. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో కలిపి మొత్తం 1049 మంది రిటైర్డ్ అధికారులు ఇంకా విధులు నిర్వహిస్తున్నట్టు తేలింది. ఇలా వివిధ శాఖ‌ల నుంచి వ‌చ్చిన స‌మాచారాన్ని క్రోడీక‌రించిన‌ జీఏడీ.. సీఎస్‌కు నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక‌ను సీఎస్ శాంతి కుమారి సీఎం రేవంత్‌రెడ్డికి అంద‌జేయ‌నున్నారు.

Leave a Comment: