Responsive Header with Date and Time

తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభకాంక్షలు తెలియజేసిన నారా చంద్రబాబు నాయుడు

Category : | Sub Category : రాజకీయం Posted on 2024-01-13 11:40:43


తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభకాంక్షలు తెలియజేసిన నారా చంద్రబాబు నాయుడు

*తెలుగు ప్రజలకు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు*


*తెలుగుజాతికి స్వర్ణయుగం -సంక్రాంతి సంకల్పం*


*ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు!*

మనిషి మనుగడకు మూలం, ప్రగతికి సంకేతం సూర్యభగవానుడు. అటువంటి సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతిగా జరుపుకుంటున్నాం. ఇది కేవలం ప్రకృతిలో జరిగే మార్పు మాత్రమే కాదు. మన జీవితంలో కూడా ప్రగతితో కూడిన మార్పు రావాలనే సందేశాన్ని సంక్రాంతి పండుగ ఇస్తుంది.  

రాష్ట్రంలో గత 5 ఏళ్ల విధ్వంస పాలనతో ప్రతి ఒక్కరి జీవితం చీకటి మయం అయ్యింది. ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన పంటలకు మద్దతు ధరల్లేవు. నిత్యావసర వస్తువుల ధరలు పేద, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీశాయి. ఉపాధి, ఉద్యోగాలు లేని కుటుంబాలు, అస్తవ్యస్తమైన రోడ్లు, భయపెడుతున్న ఆర్టీసీ చార్జీలు గ్రామాల్లో పండుగ శోభను దెబ్బతీశాయి. నేడు ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా పండుగ జరుపుకోలేని దుస్థితిలోకి ప్రభుత్వం ప్రజలను నెట్టివేసింది. ప్రతి పేద కుటుంబం పండగలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో నాటి తెలుగుదేశం హయాంలో సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ కానుకలు ఇచ్చాం. ఈ ప్రభుత్వం వాటిని కూడా రద్దు చేసి పండుగ సంతోషాలను ప్రజలకు దూరం చేసింది.

ప్రభుత్వ విధ్వంసకర, విద్వేష విధానాలతో ఉపాధి కూడా దొరక్క యువత రోడ్డున పడింది. మహిళలకు రక్షణ లేకుండా పోయింది. బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని అటకెక్కించారు. ఈ చీకట్లు పోయేలా, ఈ సంక్రాంతి నుంచి కొత్త కాంత్రి ప్రజల జీవితాల్లో వచ్చేలా మన అడుగులు పడాలని ఆకాంక్షిస్తున్నా. బంధువులు, మిత్రులు, కుటుంబ సభ్యులు అంతా కలుసుకునే సంక్రాంతి పండుగ సమయం కొత్త మార్పుకు బాటలు వేయాలి. 

సమాజ హితం, రాష్ట్ర ప్రగతి గురించి ఆలోచించి సంక్రాంతి సంకల్పం తీసుకోవాలని కోరుతున్నా. 5 ఏళ్ల రాతి యుగపాలనకు ముగింపు పలుకుతూ...స్వర్ణయుగానికి నాంది పలికేలా ప్రజలంతా సంక్రాంతి సంకల్పం తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నా. మీ, మీ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం అడుగులు వేసేందుకు ఇది సరైన సమయం. రండి! కదలి రండి! రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మేము చేసే పోరాటంలో భాగస్వాములవ్వండి. చేయి చేయి కలిపి స్వర్ణయుగం వైపు పయనిద్దాం.

 మీకు, మీ కుటుంబ సభ్యులకు మరోసారి భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు

మీ, నారా చంద్రబాబు నాయుడు

Search
Categories
తాజా వార్తలు
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: