Category : జీవనశైలి | Sub Category : జీవనశైలి Posted on 2024-11-19 10:47:08
TWM News:-లవంగాలలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. రోజూ ఒక లవంగాన్ని నమలడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే లవంగాలను న్యూట్రీషియన్ పవర్‌హౌస్‌గా పిలుస్తారు. ఇందులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, యూజీనాల్ ఉన్నాయి. ఇది ఒక రకమైన యాంటీఆక్సిడెంట్..
నోటిపూత, గొంతు నొప్పికి లవంగం ఔషధం. రోజూ లవంగాలు తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్ నొప్పిని గణనీయంగా తగ్గించుకోవచ్చు. లవంగాలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. లవంగాలను నమలడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది.
లవంగాలలోని ఔషధ గుణాలు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కాలేయ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఖాళీ కడుపుతో లవంగాలను నమలడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ఖాళీ కడుపుతో లవంగాలను తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్‌లతో పోరాడి రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు.
నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే యాంటీ బాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలు లవంగాలలో పుష్కలంగా ఉన్నాయి. లవంగాలలో సాంప్రదాయ ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది పంటి నొప్పి, నోటి ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. లవంగాలు జీర్ణక్రియను మెరుగుపరిచే జీర్ణ ఎంజైమ్‌లను కలిగి ఉంటాయి.
లవంగాలలో ఫైబర్, మాంగనీస్, విటమిన్ సి, కె ఉంటాయి. మాంగనీస్ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. లవంగాలలో ఉండే యాంటీమైక్రోబయల్ లక్షణాలు తిమ్మిర్లు, అలసట, విరేచనాలు వంటి వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రిస్తాయి. లవంగం నూనె చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కూడా బాగా పనిచేస్తుంది.
లవంగాలలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియా వృద్ధిని నిరోధిస్తాయి. లవంగం నూనె బ్రాంకైటిస్, ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలు, జలుబు, దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తుంది.