భారత్కు ఎదురుందా!
Category : క్రీడలు |
Sub Category : జాతీయ Posted on 2024-11-19 10:57:11
TWM News:-మహిళల ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీలో భారత్ నాకౌట్ సవాలు సిద్ధమైంది. లీగ్ దశలో వరుస విజయాలతో అజేయంగా ముందడుగు వేసిన సలీమా బృందం.. మంగళవారం సెమీఫైనల్లో జపాన్ను ఢీకొంటుంది.
రాజ్గిర్ (బిహార్): మహిళల ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీలో భారత్ నాకౌట్ సవాల్కు
సిద్ధమైంది. లీగ్ దశలో వరుస విజయాలతో అజేయంగా ముందడుగు వేసిన సలీమా బృందం.. మంగళవారం సెమీ ఫైనల్లో జపాన్ ను ఢీకొంటుంది. ప్రస్తుతం అదిరే ఫామ్ లో ఉన్న డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ను ఆపడం జపాను తేలికేం కాదు. లీగ్ దశలో అయిదు మ్యాచ్లు ఆడి అన్నీ గెలిచిన భారత్... ఈ క్రమంలో ఒలింపిక్స్ రజత పతక విజేత చైనాను 3-0తో కంగుతినిపించింది. కొత్త కోచ్ హరేంద్ర సింగ్ నేతృత్వంలో దూకుడు మీదున్న భారత్కు.. పెనాల్టీకార్నర్ల సద్వినియోగమే సమస్యగా ఉంది. లీగ్ దశలో చాలా పీసీలను వృథా చేసిన సలీమా బృందం.. సెమీస్ అలాంటి తప్పులకు తావిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు. స్ట్రైకర్ దీపిక, సీనియర్ ప్లేయర్ షర్మిలాదేవి, సంగీత కుమారి, ప్రీతి దూబె జోరు మీదుండడం కలిసొచ్చే అంశం. జపాన్ బలాబలాలేంటో మాకు తెలుసు. కానీ భారత్ అటు ఎటాకింగ్ ఇటు డిఫెన్స్లో బలంగా ఉంది. ఇప్పటిదాకా జట్టు ప్రదర్శన సంతృప్తికరంగా సాగింది. సెమీస్ లోనూ రాణిస్తామని భావిస్తున్నాం అని కోచ్ హరేంద్ర చెప్పాడు.