Responsive Header with Date and Time

టేస్టీ మునగాకు రైస్.. ఎలాంటి వారైనా తినేయవచ్చు!

Category : జీవనశైలి | Sub Category : జీవనశైలి Posted on 2024-11-19 11:22:02


టేస్టీ మునగాకు రైస్.. ఎలాంటి వారైనా తినేయవచ్చు!

TWM News:-మునగాకుతో చేసే వాటిల్లో మునగాకు రైస్ కూడా ఒకటి. మునగాకు ఎంత ఆరోగ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా టేస్టీగా తయారు చేసి కూడా పిల్లలకు అందించవచ్చు. మునగాకు రైస్ కూడా చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు..

మునగాకు ఇప్పటికే ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది. ఆరోగ్యాన్ని, అందాన్ని పెంచడంలో మునగాకు ఎంతో చక్కగా సహాయ పడుతుంది. మునగాకుతో ఎన్నో రకాల వంటలు కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా మునగాకుతో చేసే వాటిల్లో మునగాకు రైస్ కూడా ఒకటి. మునగాకు ఎంత ఆరోగ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా టేస్టీగా తయారు చేసి కూడా పిల్లలకు అందించవచ్చు. మునగాకు రైస్ కూడా చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. పెద్దగా సమయం కూడా పట్టదు. మరి ఈ మునగాకు రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారు ఇప్పుడు తెలుసుకుందాం.

మునగాకు రైస్‌కి కావాల్సిన పదార్థాలు:

మునగాకు, బియ్యం, జీడిపప్పు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, కొత్తిమీర, కరివేపాకు వెల్లుల్లి, ఎండు మిర్చి, జీలకర్ర, నువ్వులు, ధనియాలు, తాళింపు దినుసులు, ఉప్పు, అన్నం, మిరియాల పొడి, ఆయిల్, నెయ్యి.


మునగాకు రైస్ తయారీ విధానం:

ముందుగా మునగాకును శుభ్రంగా కడిగి నీరంతా పోయేదాకా ఆరబెట్టండి. ఆ తర్వాత అన్నాన్ని కూడా పొడి పొడిగా ఉడికించి పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు ఒక కడాయి తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసి వేడి అయ్యాక.. ఎండు మిర్చి, నువ్వులు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి వేసి వేయించి పక్కకు తీసుకోవాలి. ఆ తర్వాత ఇదే కడాయిలో మునగాకు కూడా వేసి బాగా వేయించాలి. ఇప్పుడు ముందుగా వేయించిన దినుసులు, మునగాకుతో సహా అన్నీ పౌడర్‌గా మిక్సీ పట్టాలి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా నెయ్యి, ఆయిల్ వేసి.. తాళింపు దినుసులు, కరివేపాకు, జీడిపప్పు వేసి వేయించాలి.

ఇవి వేగిన తర్వాత ఇందులోనే అన్నాన్ని వేసి బాగా కలపాలి. ఆ తర్వాత రుచికి సరిపడేలా ఉప్పు, మునగాకు పొడి కూడా వేసి మొత్తం బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేశాక పెద్ద మంట పెట్టి.. అన్నాన్ని ఓ రెండు నిమిషాలు వేయించి కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే మునగాకు అన్నం సిద్ధం. ఇది వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్‌లోకి త్వరగా అయిపోతుంది.

Search
Categories
తాజా వార్తలు
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: