Responsive Header with Date and Time

చంద్రబాబు పై జగన్ రెడ్డి పెట్టించిన కేసులన్నీ తప్పుడు కేసులు కక్షపూరితంగా పెట్టించినవే ఆలపాటి రాజేంద్రప్రసాద్

Category : | Sub Category : రాజకీయం Posted on 2024-01-12 13:10:03


చంద్రబాబు పై జగన్ రెడ్డి పెట్టించిన కేసులన్నీ తప్పుడు కేసులు కక్షపూరితంగా పెట్టించినవే ఆలపాటి రాజేంద్రప్రసాద్

*చంద్రబాబుపై జగన్ రెడ్డి పెట్టించిన కేసులన్నీ తప్పుడు కేసులని, కక్షపూరితంగా పెట్టినవని న్యాయస్థానాలకు అర్థమైంది మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్*


అధికారంలో ఉన్నానన్న అహంకారంతో జగన్ రెడ్డి, వ్యవస్థలను అడ్డంపెట్టుకొని చంద్రబాబుపై పెట్టిన తప్పుడు కేసులన్నీ న్యాయస్థానాల్లో వీగిపోతున్నాయని,  జగన్ బారి నుంచి రాజ్యాంగాన్ని, న్యాయాన్ని కాపాడుతున్న న్యాయవ్యవస్థను మనస్ఫూ ర్తిగా అభినందిస్తున్నామని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెలిపారు. 


మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే మీకోసం...!


"ప్రజలు ఇచ్చిన అధికారంతో రాష్ట్రాన్ని దోచుకొని, లక్షలకోట్లు దాచుకున్న జగన్ రెడ్డి,  ప్రజల్ని మాయమాటలతో మభ్యపెడుతూ తన దుర్మార్గపు చర్యల్ని సమర్థించుకుంటున్నాడు.

జగన్ రెడ్డి నిజంగా మనిషైతే, తనకు సిగ్గు, శరం, చీము, నెత్తురుంటే అవినీతి కేసుల్లో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. దేశంలో ఏ రాజకీయనాయకుడిపై లేనన్ని  పెద్దపెద్ద కేసులు తనపై ఉన్నా, కోర్టుల విచారణకు హాజరు కాకుండా జగన్ కుంటిసాకులు చెబుతూ తప్పించుకుంటున్నాడు. న్యాయస్థానాలు, న్యాయకోవిదులపై జగన్ రెడ్డి బురదజల్లింది నిజం  కాదా? ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా పౌరుల స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ జగన్ రెడ్డి వారిని వేధిస్తున్నది నిజం కాదా?

చంద్రబాబుపై జగన్ రెడ్డి పెట్టించిన ఐ.ఆర్.ఆర్. (ఇన్నర్ రింగ్ రోడ్), ఇసుక, మద్యం కేసులన్నీ ఆలూలేదు..చూలూ లేదు...కొడుకు పేరు ఏదో అన్నట్టుగా ఉన్నాయని న్యాయస్థానాల విచారణలో తేలిపోయింది. చంద్రబాబుపై పెట్టిన కేసుల విచారణలో ఇంత చెత్తకేసులు ఎప్పుడూ చూడలేదని న్యాయకోవిదులు బహిరంగంగానే అభిప్రాయపడుతున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ప్రభుత్వం ఎలాంటి ఆధారాలు చూపలేదని న్యాయస్థానాల వ్యాఖ్యలు జగన్ రెడ్డికి, అతని ప్రభుత్వానికి నిజంగా పెద్ద చెంపపెట్టు అనే చెప్పాలి. టీడీపీ అధినేతపై పెట్టిన తప్పుడు కేసులు...ఆధారాల్లేని  ప్రభుత్వ ఫిర్యాదులపై న్యాయస్థానాలే విస్మయం వ్యక్తం చేశాయి. ఉచితంగా ప్రజలకు ఇసుక అందించిన చంద్రబాబు దోషా... అదే ఇసుకను అమ్ముకుంటూ వేలకోట్లు దోచేసిన జగన్ రెడ్డి నిర్దోషా? రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తున్న ఇసుక కొండలు ముఖ్యమంత్రికి కనిపించడం లేదా? చంద్రబాబుపై ఇసుక కేసు పెట్టిన వెంకటరెడ్డి జగన్ రెడ్డి అడుగులకు మడుగులొత్తే వ్యక్తి కాదా?  అక్రమ మద్యాన్ని అధికధరకు అమ్ముతూ వేలకోట్లు కొట్టేసిన జగన్ రెడ్డి, చంద్రబాబు హాయాంలో అమలైన మద్యం పాలసీలో అక్రమాలు జరిగాయని నిరాధార ఆరోపణలతో న్యాయస్థానాల్ని ఆశ్రయించి భంగపడ్డాడు.  వాస్తవాలు ప్రజలకు చెబుతున్నారన్న అక్కసుతోనే జగన్ రెడ్డి టీడీపీ అధినేత సహా, ఆ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నాడని తేలిపోయింది. తలెత్తుకు తిరగాల్సిన ప్రభుత్వం, రాష్ట్ర పాలనా వ్యవస్థలు న్యాయస్థానాల ముందు తలదించుకోవడానికి కారణం జగన్ రెడ్డి కాదా?  

న్యాయశాస్త్రంలోని లొసుగుల్ని అడ్డుపెట్టుకొని జగన్ రెడ్డి అన్యాయంగా చంద్రబాబుని జైలుకు పంపాడని ప్రజలకు అర్థమైంది. చంద్రబాబుపై జగన్ రెడ్డి పెట్టించినవన్నీ కేసులన్నీ తప్పుడు కేసులు..కక్షసాధింపులో భాగంగా పెట్టినవేనని ప్రజలు గ్రహించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా జగన్ రెడ్డి నడుస్తున్న నడత సామాన్యప్రజలకు అభద్రతా భావం కలిగిస్తోంది. దివంగత రాజశేఖర్ రెడ్డే, చంద్రబాబు తప్పుచేశాడని నిరూపించలేకపోయాడు. జగన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగుతున్న సీఐడీ వ్యవస్థ  రాజ్యాంగా నికే మాయని మచ్చగా మారింది. రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చిన జగన్ రెడ్డి తన దుర్మార్గాలు ప్రజలకు తెలియచేస్తున్నారన్న అక్కసుతోనే ప్రతిపక్షనేతలపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నాడు. జగన్ దాష్టీకాల నుంచి అంబేద్కర్ రాజ్యాంగాన్ని, న్యాయాన్ని  నాయస్థానాలు రక్షించడాన్ని స్వాగతిస్తున్నాం” అని ఆలపాటి తెలిపారు.

Search
Categories
తాజా వార్తలు
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: