Category : | Sub Category : రాజకీయం Posted on 2024-01-12 12:58:04
*కుల దృవీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి జగన్ బొమ్మ ముద్రించడంపై కేంద్ర ప్రధాన ఎన్నికల కమీషనర్‌కు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసిన తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య*
• రాష్ట్రంలో రెవెన్యూ అధికారులు ఇస్తున్న కులదృవీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బొమ్మ ముద్రిస్తున్నారు.
• కుల దృవీకరణ పత్రాలపై సి.ఎం బొమ్మ ముద్రించడం ఎన్నికల సంఘం తలపెట్టిన నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు గండికొట్టడమే.
• కుల దృవీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి బొమ్మ ముద్రించి జగన్ రెడ్డికి రాజకీయ లబ్ది చేకూర్చాలని ప్రయత్నిస్తున్నారు.
• ప్రజాధనంతో రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవాలని చూడటం ప్రజాస్వామ్య విలువలకు ప్రమాదకరం.
• ఎన్నికల నోటిఫికేషన్ ఏ క్షణంలోనైనా వచ్చే ఈ తరుణంలో రెవెన్యూ అధికారుల ఇలాంటి చర్యలు తగవు.
• రెవెన్యూ అధికారులు కులదృవీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి బొమ్మ ముద్రించడం అధికార పార్టీని బలపరచడమే.
• ఎన్నికల ప్రచారం కోసం అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడరాదని ఎన్నికల నియమావళి చాలా స్పష్టంగా చెబుతోంది.
• కావున, కుల దృవీకరణ పత్రాలపై, భూమి ప్రతాలైన పాస్ పుస్తకాలపై ముఖ్యమంత్రి బొమ్మ ముద్రించకుండా చర్యలు తీసుకోగలరు.
• రాబోవు ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిపేందుకు తగు చర్యలు తీసుకోగలరు.
• అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోండి.