Responsive Header with Date and Time

ఏపీలో దారుణం... చంపేస్తాం కదా అని...సామూహిక అత్యాచారం...

Category : | Sub Category : నేర Posted on 2024-01-11 15:39:07


ఏపీలో దారుణం...  చంపేస్తాం కదా అని...సామూహిక అత్యాచారం...

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి: అమ్మ నాన్నలు కూలి పనికి వెళ్లడంతో ఒంటరిగా ఉన్న బాలిక పై అత్యాచారం చేసారు. తన నేరం బయటపడుతుంది అని తెలిసి స్నేహితుడి తో కలిసి ఆ బాలికను చంపుదాం అని వాళ్ళ ఇంటికి వెళ్లారు. ఎలాగూ చంపెస్తునాం  కదా అని ఇద్దరూ కలిసి మరోసారి అత్యాచారానికి పాల్పడి చంపేశారు.  ఈ కేసుకు సంబంధించి ఇద్దరు దోషులను బుధవారం అరెస్టు చేసినట్లు చింతపల్లి అదనపు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

ఆయన వివరాల ప్రకారం.. గూడెంకొత్తవీధి మండలంలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ బాలిక అమ్మ నాన్నలు  ఈనెల 2న కూలి పనులకు  వెళ్లారు. దీంతో ఆటో డ్రైవర్ పాంగి రమేశ్ (19) ఆమెను బెదిరించి మరో ఇంట్లోకి బలవంతంగా తీసుకెళ్లడం కొందరు చిన్నపిల్లలు  చూశారు. రమేశ్ తనపై అత్యాచారం చేసినట్లు బాలిక తన బంధువుకు చెప్పింది. ఈ విషయం గ్రామంలో అందరికీ తెలిసిపోతుందని రమేశ్ భయపడ్డాడు. తన స్నేహితుడైన మరో ఆటోడ్రైవర్ సీతన్నకు జరిగిందంతా చెప్పాడు. బాలిక  అమ్మ నాన్నలు ఇంటికి వచ్చేలోగా ఆమెను చంపేద్దామని నిర్ణయించుకున్నారు.

తొలుత రమేశ్, కొంతసేపటి తర్వాత సీతన్న ఇంట్లోకి వెళ్లారు. ఎలాగూ ప్రాణాలు తీస్తున్నాం కదా అని ఇద్దరూ కలిసి మరోసారి ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం చీరతో గొంతుకు ముడి వేసి హత్య చేశారు. ఆత్మహత్యగా చిత్రీకరించేలా దూలానికి వేలాడదీసి పరారయ్యారు. సాయంత్రం ఇంటికి వచ్చిన అమ్మ నాన్నలు బాలిక తమ బిడ్డ  చనిపోవడంతో కన్నీరుమున్నీరయ్యారు. మరుసటి రోజు అంత్యక్రియల్లో భాగంగా బాలికకు స్నానం చేయిస్తున్న సమయంలో శరీరంపై గాయాలు కనిపించాయి. అనుమానం వచ్చినా అమ్మ నాన్నలు  మృతదేహాన్ని ఖననం చేశారు.


ఈనెల 5న గూడెంకొత్తవీధి పోలీస్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయగా.. సీఐ అశోక్ కుమార్, ఎస్సై అప్పలసూరి గ్రామానికి వెళ్లి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టారు. ఖననం చేసిన మృతదేహాన్ని రెవెన్యూ అధికారులు, వైద్యుల సమక్షంలో బయటకు తీయించి పోస్టుమార్టం పూర్తి చేశారు. ఇంతలో తమ పేర్లు బయటకు వస్తాయని భావించిన నిందితులిద్దరూ వీఆర్వో సాయంతో పోలీసుల ఎదుట లొంగిపోయారు. నిందితులపై పోక్సోతోపాటు అత్యాచారం, హత్య కేసులు నమోదు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు.


Search
Categories
తాజా వార్తలు
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: