Responsive Header with Date and Time

హైదరాబాద్ లో మొదటి గోల్డ్ ఎటిఎం ప్రారంభించిన గోల్డ్ సిక్కా కంపెనీ

Category : | Sub Category : Posted on 2024-01-03 05:13:34


హైదరాబాద్ లో మొదటి గోల్డ్ ఎటిఎం ప్రారంభించిన గోల్డ్ సిక్కా కంపెనీ

హైదరాబాద్ లో మొదటి గోల్డ్ ఎటిఎం ప్రారంభించిన గోల్డ్ సిక్కా కంపెనీ వారు అమీర్పేట్ మెట్రో స్టేషన్ లో ప్రయాణికుల సౌకర్యార్థం మొదటి గోల్డ్ ఎటిఎం ఇవాళ నుంచి అందుబాటు లోకి తీసుకు వచ్చారు. ప్రారంభోత్సవం సందర్భంగా కంపెనీ సీఈఓ శ్రీ తరుజ్ గారు మాట్లాడుతూ కొత్త వెర్షన్ ఎటిఎం ఒక్క ఫీచర్స్ ని తెలియ చేసారు. కొత్త వెర్షన్ నుండి కొనుగోలు దారుని వీలుని బట్టి వారు గోల్డ్ మరియు సిల్వర్ కోయిన్స్ ని కొనుగోలు చేసుకోవచ్చు. ఈ ఎటిఎం ద్వారా గోల్డ్ మరియు 10- సిల్వర్ కోయిన్లను వారి డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్స్ ద్వారా కానీ యూపీఐ ద్వారా కానీ కొనుగోలు చేయ వచ్చు. కంపెనీ తమ ప్లాన్ ప్రకారము త్వరలోనే ౨౦౦౦ నుంచి 3000 ఎటిఎం లను దేశం లోనే కాకుండా అంతర్జాతీయంగా ఇన్స్టాల్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది అని, కంపెనీకి Russia, USA, మరియు ఇతర దేశాల నుండి ఆర్డర్స్ వస్తున్నాయి అని తెలియ చేసారు. అదే విధంగా అంతర్జాతీయ ప్రమాణాలుకు అనుగుణంగా అవసరాన్ని బట్టి విదేశీ మ్యానుఫ్యాక్చర్ల తో టై అప్ పెట్టుకుంటామని చెప్పారు. వైజాగ్ లోని బ్యూటీ వరల్డ్ ఏ సంస్థ తో మొదటి ఎటిఎం కు అగ్రిమెంట్ జరిగిందని తెలియ చేసారు. శ్రీమతి అంబికా బర్మన్ గారు మాట్లాడుతూ మీడియా వారికి మరియు కస్టమర్లకు వారి సలహాలకు కృతజ్ఞతలు తెలియ చేసారు. శ్రీ ఫణి ప్రతాప్ మాట్లాడుతూ సంస్థ తన రిసోర్సెస్ ని ఎక్కువగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తోందని మరియు ఈ ఎటిఎం ఇంకా అందరికి ఉపయోగ పడేలా డెవలప్మెంట్ జరుగుతోందని తెలియ చేశారు. మున్ముందు మరిన్ని ఫీచర్స్ తో కొత్త వెర్షన్స్ తీసుకు వస్తామని తెలియ చేశారు. Dr. ప్రవీణ్ X- యుగ టెక్నాలజీస్ తరుపున మాట్లాడుతూ గోల్డ్ సిక్కా తో అనుబంధం వారికి గర్వ కారణమని, ఇక రాబోయే ఎటిఎం లలో మరిన్ని ఫీచర్స్ వస్తాయని తెలిపారు. ఎటిఎం ద్వారానే ఏ ఆర్ టెక్నాలజీ ద్వారా కొనుగోలు దారులు కొనవచ్చని తెలిపారు. శ్రీమతి షీలా గారు బ్యూటీ వరల్డ్ తరుపున మాట్లాడుతూ ఈ ఎటిఎం వారికి బాగా నచ్చిందని, వైజాగ్ లో ఇది త్వరలో లాంచ్ అవుతుందని తెలిపారు.


Search
Categories
తాజా వార్తలు
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: