Category : | Sub Category : రాజకీయం Posted on 2024-01-03 05:08:28
YSRTP అధినేత్రి వైస్ షర్మిల..కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధం అయ్యారు. రేపు ఢిల్లీకి వెళ్లి..గురువారం కాంగ్రెస్ అగ్ర నేతల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు.
అనంతరం మీడియా తో మాట్లాడుతూ..రేపు(బుధవారం) ఢిల్లీ వెళ్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానం అందిందని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకటి రెండు రోజుల్లో అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతా అని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ తనకు కర్ణాటక నుంచి రాజ్యసభ సీటును ఆఫర్ చేసిందని . అలాగే తనకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో ప్రధాన కార్యదర్శి పదవిని కూడా ఆఫర్ చేసినట్లు చెప్పుకొచ్చారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనాలని కోరినట్లు ఆమె తెలిపారు.
వైఎస్‌ఆర్‌టీపీ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం నిరాశకు గురిచేస్తోందని, షర్మిల ఏఐసీసీలో నియమితులైతే తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తారని సంతోషిస్తున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. షర్మిలకు తెలంగాణ కోసం పని చేయాలనే ఆసక్తి ఉన్నందున మా పార్టీ నాయకులు ఆమెను ఖమ్మం, నల్గొండ లేదా సికింద్రాబాద్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని పట్టుబట్టారు. తెలంగాణలో పార్టీకి ఖ్యాతి కోసం మేమంతా ఎదురుచూస్తున్నామని వైఎస్ఆర్‌టీపీ నేతలు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.