Category : ఆరోగ్యం | Sub Category : ఆరోగ్యం Posted on 2025-01-09 15:07:16
TWM News:-అనుకుంటాం గానీ.. ఆనందంగా ఉండటం కూడా ఒక కళ. ఇది అందరికీ సాధ్యం కాదు. అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్లు.. కొందరికీ సుఖసౌఖ్యాలు అనుభవించడానికి చుట్టూ అన్నీ ఉంటాయి. కానీ అవేవీ ఆనందాన్ని ఇవ్వవు. దీంతో మనసంతా చీకటి కమ్మి విషాదంలో మునిగిపోతుంటారు. వీటి నుంచి బయటపడాలంటే ఈ కింది ఆనందమార్గాలు దారి చూపుతాయి.. ఎందుకు ఆలస్యం మీరు ఇందులో పయనించండి..
ప్రతి ఒక్కరినీ గతం వేధిస్తుంది. భవిష్యత్తు భయపెడుతుంది. ఆ రెండింటి మధ్యా చిక్కుకుని వర్తమానాన్ని నిర్లక్ష్యం చేయడం సగటు మనిషి వీక్‌నెస్. అందుకే ఈ క్షణం విలువ తెలుసుకుని, ఈ నిమిషాన్ని ఆస్వాదించమని జీవితాన్ని చదివేసిన మహానుభావులు చెబుతుంటారు. ఇంతకంటే మంచి రోజులు వస్తే రావచ్చునుగానీ గడిచిపోయిన క్షణం మాత్రం తిరిగిరాదు. అందుకే ప్రతి రోజూ, ప్రతి నిమిషం విలువైందే. అయితే ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి సంతోషంగా ఉండాలనే కోరుకుంటాడు. కొందరు సంతోషంగా ఉండేందుకు అధిక డబ్బు సంపాదిస్తే.. మరికొందరు ఆ డబ్బు ఖర్చు చేసి కొత్త బట్టలు, వస్తువులు కొనుక్కుని అందులోనే ఆనందాన్ని పొందుతారు. ఆరందాన్ని అనుభవించకుండా ఇతరులను చూస్తూ బ్రతికితే జీవితంలో ఆనందంగా ఎప్పటికీ ఉండలేరు. జీవితాన్ని ఆనందంగా మలచుకోవడానికి నిపుణులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

సమస్యలను సులభమైన మార్గంలో పరిష్కరించుకోవాలి.
పరిపూర్ణత కోసం పరుగెత్తకండి.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి.
నిరంతరం నేర్చుకోవడం అలవాటు చేసుకోండి.
ఇతరుల పట్ల కరుణతో ఉండండి