Responsive Header with Date and Time

ఏళ్ల నాటి రూ. 100 నోటు.. ఎంతకు అమ్ముడైందో తెలిస్తే బిత్తరపోతారు

Category : వ్యాపారం | Sub Category : జాతీయ Posted on 2025-01-09 15:01:41


ఏళ్ల నాటి రూ. 100 నోటు.. ఎంతకు అమ్ముడైందో తెలిస్తే బిత్తరపోతారు

TWM news:-ఇటీవల, లండన్‌లో జరిగిన వేలం ప్రక్రియలో చాలా ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అవును.! ప్రత్యేక రూ. 100 భారతీయ కరెన్సీ నోటు 56 లక్షల రూపాయలకు వేలం వేయబడింది. ఈ వార్త వైరల్‌గా మారింది. అయితే ఈ 1950ల నాటి నోటు ప్రత్యేకత ఏమిటో చూద్దాం..

చారిత్రాత్మక వస్తువులు, క్రికెటర్లు, సెలబ్రిటీలకు సంబంధించిన వస్తువులను తరచూ వేలం వేస్తుంటారు. ఇక అవి ఆక్షన్‌లో లక్షలు, కోట్లకు అమ్ముడవుతుంటాయి. ఇక ఇప్పుడు ఈ భారత కరెన్సీకి చెందిన ఓ రూ. 100 నోటు వేలంలో ఏకంగా ఎన్ని లక్షలకు అమ్ముడైందో తెలిస్తే షాక్ కావడం ఖాయం. వివరాల్లోకి వెళ్తే.. లండన్‌లో ఇటీవల జరిగిన వేలంలో భారత కరెన్సీకి చెందిన 74 ఏళ్ల నాటి రూ. 100 నోటు సుమారు రూ. 56 లక్షలకు అమ్ముడైంది. దానిని హజ్ నోట్ అని పిలుస్తారు. 1950లో హజ్ యాత్ర కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లే భారతీయ యాత్రికులకు ఈ ప్రత్యేక కరెన్సీ నోటును విడుదల చేసింది ఆర్బీఐ. బంగారం అక్రమ కొనుగోలును నిరోధించేందుకు ఈ హజ్ నోట్‌ను విడుదల చేసింది.

ఈ నోట్లు సాధారణ భారతీయ నోట్ల కంటే భిన్నమైన రంగులో ఉంటాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతర్, బహ్రెయిన్, కువైట్, ఒమన్ వంటి గల్ఫ్ దేశాలలో ఈ నోట్లు చట్టబద్ధమైనప్పటికీ, ఈ నోట్లు భారతదేశంలో చెల్లవు. 1970లో ఆర్‌బీఐ ఈ హజ్ నోట్ల ముద్రణను పూర్తిగా నిలిపివేసింది. ఈ ప్రత్యేక నోటు ఇప్పుడు వేలం ప్రక్రియలో రూ. 56,49,650కు అమ్ముడైంది.

6.90 లక్షలకు అమ్ముడైన అరుదైన రూ.10 నోటు..

అటు ఈ వేలంలో రెండు అరుదైన రూ.10 నోట్లు కూడా భారీ ధరకు అమ్ముడయ్యాయి. ఒకటి రూ.6.90 లక్షలకు అమ్ముడుపోగా, మరో నోటు రూ.5.80 లక్షలకు అమ్ముడైంది. ఈ రెండు నోట్లకు చారిత్రక ప్రాధాన్యత ఉండటం విశేషం.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
తాజా వార్తలు
Leave a Comment: