Category : జీవనశైలి | Sub Category : జీవనశైలి Posted on 2025-01-09 14:10:23
తెలుగు వెబ్ మీడియా న్యూస్ : చాలా మందికి ఖాళీ కడుపుతో పని చేయడం సుఖంగా ఉంటుంది. అయితే కొంతమంది మాత్రం ఇలా చేయడం వల్ల ఇబ్బందుల్లో పడతారు. నిజానికి ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం మంచిది కాదు. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును త్వరగా తగ్గించుకోవడం మంచిదే. కానీ ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తే, గ్లైకోజెన్ నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరం బలహీనంగా మారేలా చేస్తుంది.అలాంటప్పుడు వ్యాయామం చేయడం కష్టంగా మారుతుంది. కాబట్టి ఉదయాన్నే కాస్త తక్కువగా తిని, వ్యాయామం చేయడం వల్ల ప్రయోజనం పొందొచ్చు. అయితే ఇప్పుడు వచ్చే మరో ప్రశ్న..
ఉదయాన్నే ఏం తినాలి?
వ్యాయామానికి ముందు అరటిపండు తినవచ్చు. అరటిపండ్లు తినడం వల్ల శరీరానికి బలం చేకూరుతుంది. ఇందులో ఉండే పిండి పదార్థాలు, పొటాషియం కండరాలు, నరాలను చురుకుగా ఉంచుతాయి. అరటిపండ్లు లేదా యాపిల్ తిని కూడా వ్యాయామం చేయవచ్చు. యాపిల్స్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉండటానికి సహాయపడుతుంది. ఫలితంగా బరువు తగ్గుతారు. కడుపు నిండా తిన్న తర్వాత వ్యాయామం చేయడం కష్టంగా అనిపిస్తుంది. అందుకే లైట్‌గా తీసుకుంటే శరీరం తేలిగ్గా ఉంటుంది. చకచకా వ్యాయామం చేయొచ్చు.