Category : క్రీడలు | Sub Category : అంతర్జాతీయ Posted on 2024-11-19 10:46:36
TWM News:-డేవిసప్లో స్పెయిన్, నెదర్లాండ్స్ మధ్య క్వార్టర్ఫైనల్. మంగళవారం ఆరంభమయ్యే ఈ పోరులో విజేత ఎవరు అన్నదాని గురించి ఎవరూ పెద్దగా ఆలోచించట్లేదు. అందరి చూపు టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ బరిలో దిగుతాడా లేదా అన్నదాని పైనే.
ఫెన్రోలా (స్పెయిన్): డేవిస్కప్లో స్పెయిన్, నెదర్లాండ్స్ మధ్య క్వార్టర్ఫైనల్. మంగళవారం ఆరంభమయ్యే ఈ పోరులో విజేత ఎవరు అన్నదాని గురించి ఎవరూ పెద్దగా ఆలోచించట్లేదు. అందరి చూపు టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ బరిలో దిగుతాడా లేదా అన్నదానిపైనే. చివరిగా తమ ఫేవరెట్ ఆటగాడి ఆటను చూద్దామని అభిమానులు ఎదురు చూస్తున్నారు. స్పెయిన్- డచ్ క్వార్టర్ ఫైనల్కు ఆతిథ్యమిచ్చే జోస్ మారియా మార్టిన్ కోర్టు (సామర్థ్యం 9200) లోని టికెట్లన్నీ ఇప్పటికే అమ్ముడుపోయాయి. కానీ 38 ఏళ్ల రఫా తన చివరి టోర్నీలో బరిలో దిగుతాడా అన్నది ఇప్పటికి సందేహంగానే ఉంది.
బరిలో దిగడానికి సిద్ధంగా ఉన్నారా అని నాదల్ను ప్రశ్నించగా.. ఈ ప్రశ్నకు కెప్టెన్ సమాధానం చెప్పాలి అని బదులిచ్చాడు. స్పెయిన్ నాన్ ప్లేయింగ్ కెప్టెన్ డేవిడ్ ఫెరర్ కూడా రఫా ఆడే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. అతడు బరిలో దిగే విషయం తెలియదు. రేపు ఎవరు ఆడతారనేది ఇంకా నిర్ణయించలేదు” అని సమాధానం చెప్పాడు. నెదర్లాండ్స్లో పోరులో నాదల్ సింగిల్స్తో పాటు డబుల్స్లో బరిలో దిగాల్సి ఉంది. డబుల్స్లో కార్లోస్ అల్కరాస్తో కలిసి ఆడనున్నాడు. రిటైర్మెంట్ గురించి తాను ఆలోచించట్లేదని.. స్పెయిన నన్ను గెలిపించడం తన వంతు పాత్ర పోషించడానికే వచ్చానని మరో ప్రశ్నకు నాదల్ బదులిచ్చాడు. సింగిల్స్ లో గెలిచే స్థాయిలో పోటీ ఇవ్వలేననుకుంటే తప్పుకుంటానని తాజాగా రఫా చెప్పాడు. మరి అతడు సింగిల్స్ఆడతాడా? లేక డబుల్స్క పరిమితమవుతాడా అనేది చూడాలి.