Responsive Header with Date and Time

దేవకి నందన వాసుదేవ లో చేసిన సత్యభామ క్యారెక్టర్ గుర్తుండిపోతోంది : మానస వారణాసి

Category : సినిమా | Sub Category : సినిమా Posted on 2024-11-19 10:42:30


దేవకి నందన వాసుదేవ లో చేసిన సత్యభామ క్యారెక్టర్ గుర్తుండిపోతోంది : మానస వారణాసి

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. ఈ చిత్రానికి గుణ 369తో హిట్ కొట్టిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్ వర్మ కథ అందించారు. మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తున్నారు. నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. నవంబర్ 22 ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ మానస వారణాసి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.  

మీ నేపథ్యం గురించి చెప్పండి? 

-నేను హైదరాబాదులోనే పుట్టాను. టెన్త్ క్లాస్ వరకు మలేషియాలో చదువుకున్నాను. హైదరాబాదులో ఇంజనీరింగ్ చేశాను. కార్పొరేట్లో జాబ్ చేశాను. తర్వాత మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నాను. మిస్ ఇండియా టైటిల్ గెలిచాను. మిస్ వరల్డ్ పోటీల్లో ఇండియా ని రిప్రజెంట్ చేశాను. తర్వాత జాబ్ చేసుకోవాలా? ఈ అవకాశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలా? అని అలోచిస్తున్నుపుడు మూవీ వర్క్ షాప్స్ కి వెళ్లాను. అక్కడ సినిమా మీద పాషన్ పుట్టింది. అక్కడే యాక్టింగ్ పై కాన్ఫిడెన్స్ వచ్చింది. కొన్ని అడిషన్స్ ఇచ్చాను. సినిమా గురించి నేర్చుకుంటున్నాను. ఇది నాకు కొత్త ప్రపంచం.

-దేవకి నందన వాసుదేవ లాంటి సినిమాతో  ప్రేక్షకుల ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇది కమర్షియల్ డివైన్ థ్రిల్లర్. ఒక డెబ్యు యాక్టర్ గా ఈ యూనిట్ తో పనిచేయడం చాలా అదృష్టం. ఈ సినిమా కోసం చాలా ఎక్సయిటెడ్ గా ఎదురుచూస్తున్నాను.

ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? 

-నా క్యారెక్టర్ పేరు సత్యభామ. తను విజయనగరం అమ్మాయి. ఈ సినిమా విజయనగరం బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. సత్యభామ వెరీ ప్లే ఫుల్, లవ్ బుల్, మిస్టీరియస్ గర్ల్. ఎలాంటి కష్టం వచ్చినా ధైర్యంతో నిలబడే అమ్మాయి. ఇది పర్సనల్ గా నాకు చాలా నచ్చిన క్యారెక్టర్. కథలో నా పాత్ర వెరీ స్ట్రాంగ్ గా వుంటుంది. కథలో నాది వెరీ కీ రోల్.  

ఇది మీ ఫస్ట్ సినిమా కదా.. ఎందులో మీరెదురుకున్న ఛాలెంజెస్ ఏమిటి? 

-ఫస్ట్ మూవీ ఎప్పుడూ ఛాలెంజ్ గానే వుంటుంది. సెట్స్ లో వాడే పదాలు, డైరెక్టర్ వాడే పదాలు, సినిమా లాంగ్వేజ్ వీటన్నిటినీ అన్ స్పాట్ నేర్చుకోవాలి. స్పాంటేనియస్ గా ఉండాలి. అలాగే సత్య భామ పల్లెటూరి అమ్మాయి. ఆ బాడీ లాంగ్వెజ్, స్లాంగ్ ని వోన్ చేసుకోవడం కూడా ఛాలెంజింగ్ గా అనిపించింది. ఈ ప్రాసెస్ ని చాలా ఎంజాయ్ చేశాను. ఇది రోలర్ కోస్టర్ లాంటి రైడ్. నాకు బిగ్ లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్. చాలా విషయాలు నేర్చుకున్నాను.  


Search
Categories
తాజా వార్తలు
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: