Category : క్రీడలు | Sub Category : జాతీయ Posted on 2024-11-19 10:23:37
TWM News:-సౌదీ అరేబియాలోని జెడ్డాలో నవంబర్ 24, 25 తేదీల్లో జరగనున్న ఐపీఎల్ మెగా వేలంలో మొత్తం 574 మంది ఆటగాళ్లు పాల్గొనబోతున్నారు. వీరిలో 366 మంది భారతీయులు, 208 మంది విదేశీయులు, ఇందులో ముగ్గురు అసోసియేట్ జట్ల ఆటగాళ్లు ఉన్నారు.
IPL 2025 మెగా వేలం: సౌదీ అరేబియాలోని జెడ్డాలో నవంబర్ 24, 25 తేదీల్లో జరగనున్న ఐపీఎల్లో మెగా వేలంలో మొత్తం 574 మంది ఆటగాళ్లు పాల్గొనబోతున్నారు. వీరిలో 366 మంది భారతీయులు, 208 మంది విదేశీయులు, ఇందులో ముగ్గురు అసోసియేట్ జట్ల ఆటగాళ్లు ఉన్నారు. 330 మంది అన్‌క్యాప్డ్ ఆటగాళ్లలో 318 మంది భారతీయులు కాగా, 12 మంది విదేశీయులు. మొత్తం 204 స్లాట్‌లను భర్తీ చేయాల్సి ఉంది. వీటిలో 70 విదేశీ ఆటగాళ్లకు అందుబాటులో ఉన్నాయి. ఈసారి సౌదీలో ఆటగాళ్లపై భారీ కాసుల వర్షం కురిసే ఛాన్స్ ఉంది.
కెప్టెన్ కోసం 5 జట్ల ఎదురుచూపులు..
ఈసారి వేలంలో శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అర్ష్‌దీప్ సింగ్, రిషబ్ పంత్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. ఇది మరింత ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్‌లోని 5 జట్లకు ఒక కెప్టెన్ ఉండగా, 5 జట్లు వేలంలో కెప్టెన్‌ను చూస్తున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లకు కెప్టెన్ లేరు.
వేలంలో ఎంత డబ్బు పెట్టనున్నరంటే?
ఈసారి ఐపీఎల్ మెగా వేలంలో రూ.641 కోట్లు పణంగా పెట్టనున్నారు. 2022లో జరిగిన ఐపీఎల్ వేలంలో జట్లు అత్యధికంగా ఖర్చు చేశాయి. ఇక మెగా వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు రూ.551.7 కోట్లు వెచ్చించారు.