Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2024-11-19 10:13:14
సినీ ఇండస్ట్రీకి రాజకీయానికి అవినాభావ సంబంధం ఉన్న విషయం అందరికీ తెలుసు. రాష్ట్ర రాజకీయాలను ఎందరో సిన్ని ప్రముఖులు తమ వాడి వేడి మాటలతో పరుగులు పెట్టించారు. ప్రస్తుతం ఉన్న వారిలో అప్పుడప్పుడు వెరైటీగా మాట్లాడుతూ.. తనదైన శైలిలో విమర్శలు చేస్తూ వైరల్ అయిన నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి. తాజాగా అతనిపై ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో కేసులు నమోదయాయని తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియా విష ప్రచారంపై జరుగుతున్న దుమారంలో నేపథ్యంగా పోసాని కృష్ణ మురళి పై కేసులు నమోదయ్యాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటుగా లోకేష్ పై కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ రాజమండ్రి, విజయవాడ, కడప పోలీస్ స్టేషన్లో అతనిపై ఫిర్యాదులు అందాయి. మరొక రాజంపేట పోలీస్ స్టేషన్లో కూడా పలువురు టిడిపి నేతలు పోసానిపై ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేశారట.
ఇప్పటికే అటు ఇటుగా 50 కి పైగా కేసులు నమోదైన పోసానిపై తాజాగా ఏపీ సీఐడీ కూడా కేసు నమోదు చేసింది. సెప్టెంబర్ నెలలో నిర్వహించినటువంటి ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న పోసాని ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసత్య ప్రచారం తో పాటుగా అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ రాష్ట్ర తెలుగు యువత ప్రతినిధి అయిన బండారు వంశీకృష్ణ ఫిర్యాదు ఇచ్చారు. ఈ మేరకు సీఐడీ అధికారులు కేసు నమోదు చేసుకున్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని వ్యక్తిగతంగా కించపరిచే విధంగా పోసాని మాట్లాడారని.. ఆయన మాటలు కొన్ని వర్గాల మధ్య విభేదాలు సృష్టించేలా ఉన్నాయి అని వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక దీనిపై వైసీపీ నేతలు, పోసాని ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. మరోపక్క ఏపీలో అధికారంలోకి వచ్చిన అనంతరం కూటమి నేతలు సోషల్ మీడియా వేదికగా తమపై, తమ కుటుంబ సభ్యులపై జరుగుతున్న అసత్య ప్రచారాలను తిప్పి కొట్టడానికి కీలకమైన బిల్లులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ బడ్జెట్ సమావేశాలలోని దీనికి శ్రీకారం చుడుతారు అన్న టాక్ నడుస్తోంది.