Responsive Header with Date and Time

ఈ పొడిని రోజూ చిటికెడు వాడితే చాలు.. తలనొప్పి నుంచి గుండె వరకు.. సమస్యలన్నీ పరార్..!

Category : ఆరోగ్యం | Sub Category : ఆరోగ్యం Posted on 2024-11-19 09:52:50


ఈ పొడిని రోజూ చిటికెడు వాడితే చాలు.. తలనొప్పి నుంచి గుండె వరకు.. సమస్యలన్నీ పరార్..!

TWM News:-ఇందులోని మెగ్నీషియం, మిరిస్టిసిన్ వంటి సమ్మేళనాలు ఒత్తిడిని దూరం చేయడంలో సహాయపడుతుంది. నోటి దుర్వాసన సమస్యకు కూడా ఇది బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇందులోని యాంటీమైక్రోబయల్ లక్షణాలు నోటి దుర్వాసనను తరిమి కొట్టడంలో ఉపయోగడుతుంది. గుండె సంబంధిత సమస్యలను దూరం చేయడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది.

లవంగాలు, సాజీరా, యాలకులు, దాల్చిన చెక్క, జాజికాయ, జాపత్రి ఇలాంటి సుగంధ ద్రవ్యాలు లేని భారతీయ వంటిల్లు ఉండదనే చెప్పాలి. ఇలాంటి మసాలా దినులెన్నో మన భారతీయులు పురాతన కాలం నుంచి పలు వంటకాల్లో ఉపయోగిస్తున్నారు. వాటిలో ఒకటై జాజికాయలతో వంటలకు చక్కని రుచి, సువాసన వస్తాయి. అయితే జాజికాయల వల్ల మనకు అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయని మీకు తెలుసా..?అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి జాజికాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని ఫైబర్‌ కంటెంట్‌ ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం నుంచి ఉపశమనం కల్పిస్తుంది. మెదడు ఆరోగ్యాన్ని రక్షించేందుకు జాజికాయ ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ యాక్సిడెంట్స్‌ ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి మెదడు కణాలను రక్షించడంలో సహాయపడతాయి. కండరాల నొప్పిని దూరం చేయడంలో కూడా జాజికాయ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఆర్థరైటిస్‌తో పాటు నొప్పిని దూరం చేస్తుంది.

నిద్రలేమి సమస్యలతో బాధపడేవారికి కూడా జాజికాయ బాగా పనిచేస్తుంది. ఇందులోని మెగ్నీషియం, మిరిస్టిసిన్ వంటి సమ్మేళనాలు ఒత్తిడిని దూరం చేయడంలో సహాయపడుతుంది. ఇందులోని మెగ్నీషియం, మిరిస్టిసిన్ వంటి సమ్మేళనాలు ఒత్తిడిని దూరం చేయడంలో సహాయపడుతుంది. నోటి దుర్వాసన సమస్యకు కూడా జాజికాయ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇందులోని యాంటీమైక్రోబయల్ లక్షణాలు నోటి దుర్వాసనను తరిమి కొట్టడంలో ఉపయోగడుతుంది. గుండె సంబంధిత సమస్యలను దూరం చేయడంలో జాజికాయ ఉపయోగపడుతుంది.

జాజికాయ పొడి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలును తగ్గిస్తాయి. రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. కిడ్నీ ఆరోగ్యానికి జాజికాయ బెస్ట్‌ ఆప్షన్‌గా పనిచేస్తుంది. జాజికాయ పొడిని తీసుకోవడం వల్ల లివర్‌, కిడ్నీల్లో పేరుకుపోయే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. జాజికాయ నూనె నొప్పులకు బాగా పనిచేస్తుంది. కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)


Search
Categories
తాజా వార్తలు
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: