Category : క్రీడలు | Sub Category : అంతర్జాతీయ Posted on 2024-11-19 09:48:48
TWM News:-భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్ నవంబర్ 23 నుంచి ప్రారంభమవుతుంది. 2025 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు అర్హత సాధించేందుకు భారత్‌కు ఐదు మ్యాచ్‌ల సిరీస్ కీలకం. పెర్త్, అడిలైడ్, బ్రిస్బేన్, మెల్‌బోర్న్, సిడ్నీలలో మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఇండియా vs ఆస్ట్రేలియా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024: నవంబర్ 22 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య 5 మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య ఈ ఐదు టెస్టు మ్యాచ్‌లు వరుసగా పెర్త్, అడిలైడ్, బ్రిస్బేన్, మెల్‌బోర్న్, సిడ్నీలలో జరగనున్నాయి. ఈ సిరీస్‌లో గత రెండు టూర్‌లలో ఆస్ట్రేలియాను ఓడించి టీమిండియా చరిత్ర సృష్టించింది. అందుకే, ఈసారి కూడా అదే విజయ పరంపర కొనసాగించాలని టీమిండియా భావిస్తోంది. వీటన్నింటితో పాటు, 2025 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు అర్హత సాధించాలంటే భారత్ 4-0తో ఆస్ట్రేలియాతో ఈ టెస్టు సిరీస్‌ను గెలవాల్సి ఉంటుంది. కాబట్టి, డబ్ల్యూటీసీ ఫైనల్ దృష్ట్యా ఈ సిరీస్‌లో విజయం భారత్‌కు తప్పనిసరి.
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లైవ్ కవరేజీని టీవీలో ఏ ఛానెల్‌లో చూడవచ్చు?
స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్‌ను ఏ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో చూడొచ్చు?
డిస్నీ + హాట్‌స్టార్ అనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే తొలి టెస్టు మ్యాచ్‌ని మీరు వీక్షించవచ్చు.