Category : ఆరోగ్యం | Sub Category : ఆరోగ్యం Posted on 2024-11-19 09:46:53
TWM News:-స్వీట్‌కార్న్..ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన స్నాక్ ఐటమ్. స్వీట్‌కార్న్ బండి కనిపిస్తే చాలు.. చాలా మందికి నోరూరుతుంది. వేడివేడిగా కాల్చిన స్వీట్‌కార్న్ అయినా లేదా ఉడికించిన స్వీట్‌కార్న్ అయినా తినాలనిపిస్తుంది. దానికి ఉప్పుకారం, మిరియాల పొడి, చాట్‌మసాలను యాడ్ చేసుకుని తింటే ఆ రుచే వేరు.. స్వీట్‌కార్న్ రుచిలోనే కాదు.. పోషకాల్లోనూ స్వీట్‌కార్న్ చాలా బెటర్ అంటున్నారు నిపుణులు. ఇక వీటిని డైలీ డైట్లో చేర్చుకుంటే ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం..
స్వీట్‌కార్న్‌లో యాంటీ ఆక్సిడెంట్‌లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి క్యాన్సర్‌కు కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌ను శరీరంలోంచి తరిమికొడతాయి. ముఖ్యంగా బ్రెస్ట్, లివర్ క్యాన్సర్‌కు చెక్ పెట్టడంలో యాంటీ ఆక్సిడెంట్స్ కీలక పాత్ర పోషిస్తాయి. స్వీట్‌కార్న్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిలో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, పైల్స్‌తో బాధపడుతున్న వారికి ఈ స్వీట్‌కార్న్ దివ్యౌషధంగా చెప్పాలి.
స్వీట్‌కార్న్‌లో ఫాస్ఫరస్, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఐరన్, కాపర్, జింక్ వంటి ఖనిజాలు.. ఎముకలు, కిడ్నీల పనితీరు మెరుగుపడేలా చేస్తాయి. అంతేకాదు.. స్వీట్‌కార్న్‌లలో ఉండే విటమిన్-సి, కెరోటినాయిడ్స్, బయోఫ్లెవనాయిడ్స్ గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. వీటిలో ఉండే విటమిన్ బి-12, ఐరన్, ఫోలిక్ యాసిడ్‌లు రక్తహీనతకు చెక్ పెడుతాయి. హైబీపీ ఉన్నవారు వీటిని తినడం మంచిది.
స్వీట్‌కార్న్ తిన్నాకూడా చాలా వేగంగా జీర్ణమవుతుంది. కాబట్టి శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అధిక ఒత్తిడితో ఇబ్బంది పడుతున్న వారికి స్వీట్ కార్న్ మంచి మందులా పనిచేస్తుంది. అందులో ఉండే ఫినోలిక్ ఫైటో కెమికల్స్ హైపర్ టెన్షన్‌ను తగ్గిండచంలో బాగా పనిచేస్తాయి.
స్వీట్‌కార్న్‌లలో ఉండే విటమిన్-సి, కెరోటినాయిడ్స్, బయోఫ్లెవనాయిడ్స్ గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. వీటిలో ఉండే విటమిన్ బి-12, ఐరన్, ఫోలిక్ యాసిడ్‌లు రక్తహీనతకు చెక్ పెడుతుంది. స్వీట్ కార్న్‌లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఇది మీ కణాల నష్టం, క్యాన్సర్ నుండి రక్షిస్తుంది.
స్వీట్ కార్న్‌లో కెరోటినాయిడ్స్, లుటిన్ ఉంటాయి. దీని వల్ల కంటిశుక్లం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. కంటి సంబంధ సమస్యలు రాకుండా చూస్తాయి. స్వీట్ కార్న్‌లో ఉండే విటమిన్ బి1 జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మెదడును చురుగ్గా ఉంచుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. స్వీట్ కార్న్ తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. స్వీట్ కార్న్ కూడా చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.