Category : | Sub Category : రాజకీయం Posted on 2024-02-24 10:41:13
TWM News : తెలంగాణ ప్రజలకు ధరణి సమస్యల నుంచి మోక్షం కలిగేనా..? ధరణి పేరు మార్పు పై సీఎం రివ్యూలో డెసిషన్ తీసుకుంటారా? ధరణి, రైతు భరోసా విషయంలో ప్రభుత్వం అడుగులు ఎలా ఉండబోతున్నాయో అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమీక్ష చేయనున్నారు. ఫుల్ డే ధరణిపై మంత్రులు, ధరణి కమిటీ, ఉన్నతాధికారులతో కలిసి అధ్యయం చేస్తారు. ముందుగా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. ధరణికి భూమాతగా పేరు మార్పుతో పాటు సైట్ ను సరళీకరించడంపై చర్చిస్తారు. అభ్యంతరాల నివృత్తికి మార్గాలను కలెక్టర్లతో చర్చిస్తారు సీఎం. తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశం చాలా ఆసక్తికరంగా మారనుంది. , రైతు బంధుతో పాటు ధరణి పేరు మార్పు.. ధరణిలో సమస్యల పరిష్కారానికి ఎలా అడుగులు వేయబడుతుందనే దానిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
అయితే ఇప్పటికే ధరణి సమస్యలపై కమిటీ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. యాక్షన్ లోకి దిగిన ధరణి కమిటీ ఐదు జిల్లాల కలెక్టర్లు, దేవదాయ శాఖ, అటవీ శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం అయింది ధరణి కమిటీ. ధరణి వచ్చాక నేరుగా ప్రజలు, రైతుల పడుతున్న ఇబ్బందులను గుర్తించింది కమిటీ. భూ సమస్యలకు సంబంధించి ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుంది. వాటిపై ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు చేయాలని దానిపై నివేదికను సిద్ధం చేసింది కమిటీ. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో ఈరిపోర్ట్ ను ముందుంచనుంది. ప్రభుత్వానికి పలు సూచనలు చేయనుంది. అయితే ధరణి వెబ్ సైట్ ని ఒక ప్రైవేటు కంపెనీకి అప్ప చెప్పకుండా సీసీఎల్ఏ వద్ద భద్రంగా ఉంచాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది.. ఇప్పటికే ప్రైవేటు కంపెనీకి అప్ప చెప్పడం ద్వారా రాష్ట్రంలో ఎవరికైతే భూములు ఉన్నాయో ఆ వివరాలన్నీ ప్రైవేటు వారికి అప్పజెప్పారనే బావనలో తెలంగాణ ప్రజలు ఉన్నారని ప్రభుత్వం భావిస్తుంది.