బుడ్డొడు బుడ్డొడు అనుకుంటే.. ఏకంగా 200 మందిని నిలువునా ముంచేశాడు..! 19 ఏళ్ల ఖతర్నాక్ అరెస్ట్..
Category : నేర |
Sub Category : జాతీయ Posted on 2024-11-15 11:05:15
TWM News:-ఎలాగోలా కాసిఫ్ కంత్రీ ప్లాన్ బయటపడింది. మోసపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పక్కా సమాచారం మేరకు పోలీసులు బాలుడి ఇంటిపై దాడి చేసి నగదు లెక్కింపు యంత్రం, కారు, ల్యాప్‌టాప్, మొబైల్ వంటి వాటిని స్వాధీనం చేసుకున్నారు.
టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందుతుందో.. సైబర్ మోసాల సంఖ్య కూడా పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా అమాయకులను టార్గెట్‌గా చేసుకున్న ఖతర్నాక్ కేటుగాళ్లు వేల మందిని మోసం చేసి కోట్లు కొల్లగొట్టిన ఉదంతాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ఆన్‌లైన్ మోసాలు ఇటీవల సర్వసాధారణంగా మారాయి. ఇదే తరహాలో మరో మోసం వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందిన 11వ తరగతి విద్యార్థి ఫేక్ డిపాజిట్ పథకం పేరుతో దాదాపు 200 మందిని మోసం చేశాడు. యూట్యూబ్ ద్వారా మోసం చేయటం ఎలాగో నేర్చుకున్న19 ఏళ్ల యువకుడు కాసిఫ్ మిశ్రా ఆన్‌లైన్‌లో నకిలీ పెట్టుబడి పథకం కింద సుమారు రూ.42 లక్షలు కాజేశాడని తెలిసింది.
ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో లక్షలాది మంది ఫాలోవర్లను కలిగి ఉన్న నిందితుడు కసీఫ్ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఇన్వెస్టర్లను ఎరగా మార్చుకున్నాడు. ప్రారంభంలో తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టిన వారికి ఎక్కువ డబ్బు ఇచ్చాడు. అలా ప్రజల్లో మంచి గుర్తింపు వచ్చేలా ప్లాన్ చేశాడు.. ఒకసారి పెట్టుబడి పెట్టిన వారికి తమ స్నేహితులు, పరిచయస్తులకు చెప్పమని ఒప్పించాడు. అప్పుడు రూ. 99,999 పెట్టుబడి పెడితే 13 నెలల్లో రూ.13,99,999లు వస్తాయని కల్పించాడు. అతని మాటలు నమ్మి దాదాపు 200 మంది సదరు కిలాడీ యువకుడి మాయలో పడ్డారు.
ఎలాగోలా కాసిఫ్ కంత్రీ ప్లాన్ బయటపడింది. మోసపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పక్కా సమాచారం మేరకు పోలీసులు బాలుడి ఇంటిపై దాడి చేసి నగదు లెక్కింపు యంత్రం, కారు, ల్యాప్‌టాప్, మొబైల్ వంటి వాటిని స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల పాటు రిమాండ్ హోంకు తరలించినట్టుగా తెలిసింది.