Responsive Header with Date and Time

పిల్లల భవిష్యత్తు కోసం బెంగవద్దు.. ఆ పథకాల్లో పెట్టుబడి పెడితే చాలంతే..!

Category : వ్యాపారం | Sub Category : జాతీయ Posted on 2024-11-15 10:12:57


పిల్లల భవిష్యత్తు కోసం బెంగవద్దు.. ఆ పథకాల్లో పెట్టుబడి పెడితే చాలంతే..!

TWM News:-పిల్లల బంగారు భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టబడతారు. వారి చదువు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మంచి ఉద్యోగం చేసి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తారు. అదే సమయంలో పిల్లల పేరు మీద పొదుపు చేయడం కూడా చాలా అవసరం. ప్రతినెలా మీరు చేసే చిన్న పొదుపు వారికి భవిష్యత్తులో ఎంతో ఆసరాగా మారుతుంది. పెరిగి పెద్దవారయ్యే సరికీ అధిక మొత్తంలో రాబడిని అందిస్తుంది.

పెట్టుబడి వల్ల వారి అవసరాలు తీరడంతో పాటు జీవితానికి ఆర్థిక భరోసా అందుతుంది. ఒడిదొడుకులు లేకుండా ప్రశాంతంగా జీవించడానికి అవకాశం కలుగుతుంది. అలాగే పిల్లలకు కూడా పొదుపును నేర్పినట్టు ఉంటుంది. ఈ నేపథ్యంలో పిల్లల కోసం అమలవుతున్న వివిధ పొదుపు పథకాల గురించి తెలుసుకుందాం.

మైనర్ల పీపీఎఫ్

మైనర్ల కోసం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) అమలవుతోంది. దీర్ఘకాలంలో రాబడిని పెంచుకోవడానికి ఇది మంచి మార్గం. అయితే దీనిలో స్థిరంగా పెట్టుబడులు పెట్టాలి. ఈ ఖాతాకు 15 ఏళ్ల లాక్ పిరియడ్ ఉంటుంది. తల్లిదండ్రులు తమ పిల్లల పీపీఎఫ్ కు అందించే సహకారంపై ఎలాంటి పరిమితి లేదు

ఫిక్స్ డ్ డిపాజిట్లు

పిల్లల కోసం కొన్ని బ్యాంకులు ఫిక్స్ డ్ డిపాజిట్ (ఎఫ్ డీ) పథకాలను అమలు చేస్తున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లల పేరుమీద వీటిని తీసుకోవచ్చు. తమను, లేదా భాగస్వామిని సంరక్షకులుగా పేర్కొంటూ ఎఫ్ డీ తెరవొచ్చు. వీటికి అధిక వడ్డీ రేటు ఉంటుంది. నిర్థిష్ట కాల వ్యవధికి అసలుతో పాటు వడ్డీని కలిపి అందుకునే అవకాశం ఉంటుంది.

ఎన్ పీఎస్ వాత్సల్య

కేంద్ర ప్రభుత్వం ఇటీవల నేషనల్ పెన్షన్ స్కీమ్ వాత్సల్య (ఎన్ పీఎస్ వాత్సల్య)ను ప్రారంభించింది. ఇది మైనర్ల కోసం ప్రవేశపెట్టిన పెన్షన్ స్కీమ్. దీన్ని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) పర్యవేక్షిస్తుంది. దీన్ని పిల్లల పదవీ విరమణ ప్రణాళికకు తల్లిదండ్రులు అందించే సహకారం అని చెప్పవచ్చు. నెలకు కనీసం రూ.వెయ్యి పెట్టుబడి పెట్టాలి. గరిష్ట పరిమితి లేదు. ఈ పథకం మార్కెట్ – లింక్డ్ దీర్ఘకాలిక పెట్టుబడులను అందిస్తుంది.

గోల్డ్ ఈటీఎఫ్ లు

పిల్లల కోసం పెట్టుబడి పెట్టాలనుకునే వారికి గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెట్ ఫండ్స్ ( గోల్డ్ ఈటీఎఫ్) మంచి ఎంపిక. ఎఫ్ డీ, బ్యాంకు ఖాతాలలో డిపాజిట్ల కంటే ఎక్కువ రాబడి అందిస్తాయి. వీటిలో ఇన్వెస్ట్ చేసిన డబ్బులను బంగారంపై పెట్టుబడి పెడతారు. బంగారం ధర ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి వీటి నుంచి రాబడి బాగుంటుంది.


Search
Categories
తాజా వార్తలు
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: