Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2024-11-15 10:05:22
ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఎన్నికయ్యారు. ఈ మేరకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. ఈ పదవికి ఒక్క నామినేషన్ దాఖలు రావడంతో రఘురామ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. రఘురామ 2019 ఎన్నికల్లో నరసాపురం లోక్సభ స్థానం నుంచి వైసీపీ తరపున గెలిచారు. తర్వాత కొద్ది రోజుల్లోనే వైసీపీ ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. అప్పటి సీఎం జగన్కు సింహస్వప్నంగా తయారయ్యారు. 2024 ఎన్నికలకు ముందు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన రఘురామ, ఉండి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.