Category : క్రీడలు | Sub Category : అంతర్జాతీయ Posted on 2024-11-15 09:45:59
TWM News:-ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి సంబంధించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఎలాంటి అధికారిక టోర్నమెంట్ షెడ్యూల్ లేకుండానే పాకిస్థాన్‌లో ట్రోఫీ టూర్ ప్రారంభం కానుంది. ఐసీసీ టోర్నీల చరిత్రలో గతంలో ఎన్నడూ చూడలేదు. ట్రోఫీ పర్యటన నవంబర్ 16 నుంచి నవంబర్ 24 వరకు కొనసాగుతుంది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి సంబంధించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఎలాంటి అధికారిక టోర్నమెంట్ షెడ్యూల్ లేకుండానే పాకిస్థాన్‌లో ట్రోఫీ టూర్ ప్రారంభం కానుంది. ఐసీసీ టోర్నీల చరిత్రలో గతంలో ఎన్నడూ చూడలేదు. ట్రోఫీ పర్యటన నవంబర్ 16 నుంచి నవంబర్ 24 వరకు కొనసాగుతుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ పర్యటనను ప్రకటించిన పిసిబి..
అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని దుబాయ్ నుంచి ఇస్లామాబాద్‌కు పంపింది. ఇప్పుడు ఈ ట్రోఫీ పర్యటనకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సిద్ధమైంది. అంటే, ఈ ట్రోఫీని పాకిస్థాన్‌లోని వివిధ చోట్ల అభిమానుల మధ్యకు తీసుకెళ్లనున్నారు. ట్రోఫీ పర్యటన నవంబర్ 16న ఇస్లామాబాద్‌లో ప్రారంభమవుతుంది. ఇందులో స్కర్డు, మూరి, హుంజా, ముజఫరాబాద్ వంటి ప్రదేశాలు ఉంటాయి. ఈ ట్రోఫీ పర్యటన నవంబర్ 16 నుంచి నవంబర్ 24 వరకు కొనసాగుతుంది. అదే సమయంలో, ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు 19 ఫిబ్రవరి నుంచి 9 మార్చి 2025 వరకు ఆడాల్సి ఉంటుంది.