Category : అంతర్జాతీయ | Sub Category : వార్తలు Posted on 2024-11-14 13:23:55
TWM News:-వెయిటింగ్ టైమ్‌ను తగ్గించేందుకు గత ఏడాది కాలంగా అమెరికా పలు చర్యలు చేపట్టడంతో పరిస్థితి కొంత మేర మెరుగుపడింది. ముఖ్యంగా గతేడాది భారతీయ దరఖాస్తుదారుల కోసం ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయిలో 14 లక్షల వీసాలను ప్రాసెస్ చేయడంతోపాటు విజిటర్ వీసా అపాయింట్‌మెంట్ టైమ్‌ను 75% మేరకు తగ్గించగలిగారు. అయినప్పటికీ అమెరికా వీసాల కోసం సుదీర్ఘ కాలంపాటు నిరీక్షించాల్సిన పరిస్థితి మళ్లీ తలెత్తింది. ప్రస్తుతం బీ1/బీ2 వీసాల కోసం భారత్‌లోని అమెరికా కాన్సులేట్లలో నిరీక్షణ సమయం ఒక్కో చోట ఒక్కో రకంగా ఉంది.
కోల్‌కతాలో అత్యధింగా 499 రోజులపాటు నిరీక్షించాల్సి వస్తుండగా.. చెన్నైలో 486 రోజులు, హైదరాబాద్‌లో 435 రోజులు, ఢిల్లీలో 432 రోజులు, ముంబై 427 రోజులు పడుతోంది. ఒకవేళ మీరు థర్డ్ కంట్రీ నేషనల్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ పరిస్థితి దాదాపు ఇలాగే ఉంటుంది. అపాయింట్‌మెంట్ కోసం అబూదాబీలో 332 రోజులు, దుబాయ్‌లో 289 రోజులు వేచి ఉండాల్సి ఉంటుంది. స్వదేశంలో కాకుండా వేరే దేశంలోని అమెరికా కాన్సులేట్ నుంచి పొందే వీసాను థర్డ్ కంట్రీ నేషనల్ వీసా అంటారు.