Category : జీవనశైలి | Sub Category : జీవనశైలి Posted on 2024-11-14 12:50:34
TWM News:-సైనికుడు యుద్ధ భూమిలో అడుగు పెట్టాడంటే ప్రతి క్షణం పోరాటం చేస్తాడు. ఎంత సైనికుడైనా.. మనిషే కదా! అతనికి కూడా నిద్ర వస్తుంది. నిద్ర లేకుంటే బాడీ యుద్ధానికే కాదు… దేనికీ సహకరించదు. అందుకే ఉన్న టైమ్ నే ఉపయోగించుకోవాలి. ఎప్పుడు ఏం అవుతుందో తెలియదు. రెస్ట్ కావాలి. కాబట్టి, కన్ను మూసిన వెంటనే నిద్రపట్టాలి. కూత పెట్టగానే మేల్కోవాలి. అది మాటలతో చెప్పినంత ఈజీకాదు. అందుకే.. పరిస్థితులు ఎలా ఉన్నా.. సైనికులు రెండు నిమిషాల్లో నిద్రలోకి జారుకునే ఒక టెక్నిక్ ను అమెరికాలో ఆర్మీ ఫాలో అవుతోంది. అది మామూలుగా నిద్రపోవడానికి ఇబ్బంది పడేవాళ్లకు కూడా ఉపయోగపడుతుందనడంలో డౌట్ లేదు. ఆర్మీలో చేరిన వాళ్లతో ఆరు వారాల పాటు ఈ టెక్నిక్ ని ప్రాక్టీస్ చేయిస్తారు. ఈ టెక్నిక్ కి నాలుగు స్టెప్స్ ఉంటాయి. ముందు ఫేస్ మజిల్స్ రిలాక్స్ చేసుకోవాలి. కళ్ల చుట్టు ఉండే మజిల్స్, నాలుక, దవడ మజిల్స్ ని రిలాక్స్ చేయాలి. ఒకసారి ఫేస్ రిలాక్స్ అయితే… భుజాలను కిందికి దించాలి. అవి ఎంత కిందికి వెళితే.. అంత కిందికి, ఆ తర్వాత చేతుల్ని ఒక్కోవైపు ఒక్కోసారి కిందికి దించాలి.