Responsive Header with Date and Time

బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసమే..

Category : జీవనశైలి | Sub Category : జీవనశైలి Posted on 2024-11-14 12:34:41


బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసమే..

TWM  News:-బ్రషింగ్ విషయంలో మనలో కొందరు తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటారు.

వీటిలో ప్రధానమైంది టూత్ పేస్ట్‌. సాధారణంగా ఎక్కువ టూత్‌ పేస్ట్‌ వాడితే మంచిదని మనలో చాలా మంది భావిస్తుంటారు. ఇంతకీ టూత్ పేస్ట్‌ ఎక్కువగా వాడడం మంచిదేనా.?బ్రష్ చేయడానికి ఎంత టూత్ పేస్ట్ వాడాలి?


ఈ విషయం గురించి బహుశా ఎవరూ.. ఎప్పుడూ ఆలోచించి ఉండరు. కానీ, ఆలోచించాలి. మోతాదుకు మించి పేస్ట్ వాడితే పళ్ల ఆరోగ్యం పాడవుతుంది. ఈ విషయం ‘సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ప్రివెన్షన్’ జరిపిన అధ్యయనంలో తేలింది. అమెరికన్ డెంటల్ అసోసియేషన్ కూడా ఇదే చెబుతోంది. 3 నుంచి 6 ఏళ్ల వయసు పిల్లలు బ్రష్ చేయడానికి బఠాణీ గింజ పరిమాణానికి మించి పేస్ట్ వాడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా తల్లిదండ్రులు పిల్లల బ్రష్‌లపై ఎక్కువ పేస్ట్ వేస్తుంటారు. కానీ, దానివల్ల చాలా దుష్పరిణామాలుంటాయి.

అసలు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎంత టూత్‌ పేస్ట్‌ను వాడాలో చూద్దాం.


టూత్‌పేస్ట్‌ ఎక్కువగా ఉపయోగించడం వల్ల లాభం ఉండకపోగా నష్టం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బఠానీ గింజ పరిమాణం ఉంటే చాలని చెబుతున్నారు. ఇది మొత్తం దంతాలను శుభ్రం చేసుకోవడానికి సరిపోతుంది. అయితే టూత్ పేస్ట్‌ను ఎక్కువగా ఉపయోగించడం హానికరమని నిపుణులు అంటున్నారు. దీనివల్ల దంతాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది.


సాధారణంగా టూత్‌ పేస్టుల్లో సోడియం ఫ్లోరైడ్‌ను ఉపయోగిస్తారు. ఇది దంతాలను బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే అధిక మొత్తంలో తీసుకుంటే సోడియం ఫ్లోరైడ్‌ కారణంగా నోటి ఆరోగ్యం దెబ్బతింటుంది. మరీ ముఖ్యంగా చిన్నారుల్లో దంతాల్లో కావిటీస్‌ ఏర్పడి ఫ్లోరోసిస్‌ వంటి సమస్యలు వస్తాయి. అందుకే కొంత మొత్తంలోనే టూత్‌ పేస్ట్‌ను ఉపయోగించాలి. ఇక నోటి ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే మౌత్‌ ఫ్రెషనర్స్‌ను వైద్యుల సలహాతో ఉపయోగించాలి. ముఖ్యంగా నోటి దుర్వాసన, నోట్లో బ్యాక్టీరియా తగ్గాలంటే మౌత్ ఫ్రెషనర్స్‌ బాగా ఉపయోగపడతాయి.

పిల్లల్లో కొత్తగా పళ్లు వచ్చే సమయంలో అది డెంటల్ ఫ్లోరోసిస్‌కు దారి తీసే ప్రమాదముంది. దీంతో పిల్లల పళ్ల రంగు మారిపోతుంది. దీనికి చికిత్స తీసుకోకపోతే పళ్లు పుచ్చిపోతాయి. ఎందుకంటే టూత్ పేస్టులో ఫ్లోరైడ్ ఉంటుంది. దాన్ని తగినంత మోతాదులో తీసుకుంటే పళ్లను కాపాడుతుంది. పరిమితి కంటే ఎక్కువైతే హాని చేస్తుంది.అందుకే, ఇక నుంచి మీ పిల్లలే కాదు, మీరు కూడా పేస్ట్ ఎంత కావాలో అంతే వేసుకోండి.

Search
Categories
తాజా వార్తలు
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: