Category : క్రీడలు | Sub Category : జాతీయ Posted on 2024-11-14 11:43:23
TWM News:-టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్లు ధోనీ, విరాట్ కోహ్లీ, ద్రవిడ్‌లపై సంజూ శాంసన్ తండ్రి విశ్వనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ నలుగురు కలిసి తన కొడుకు సంజూ శాంసన్ పదేళ్ల క్రికెట్ కెరీర్‌ను పాడు చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు విషయం ఏంటంటే?
ప్రస్తుతం సౌతాఫ్రికాలో ఉన్న సంజూ శాంసన్ తొలి టీ20లో అద్భుత సెంచరీ చేసి టీమ్ ఇండియాను విజయతీరాలకు చేర్చాడు. దీనికి ముందు బంగ్లాదేశ్‌పై కూడా సంజూ సెంచరీ చేశాడు. సంజూ శాంసన్ వరుసగా రెండు T20 మ్యాచ్‌లలో సెంచరీలు సాధించి తన ప్రతిభను నిరూపించుకున్నాడు, అయితే ఇప్పుడు ఈ యంగ్ ప్లేయర్ తన తండ్రి చేసిన ప్రకటన కారణంగా వివాదంలో చిక్కుకున్నాడు. ధోనీ, విరాట్, రోహిత్ శర్మ తన కుమారుడి పదేళ్ల క్రికెట్ కెరీర్‌ను పాడు చేశారని సంజూ శాంసన్ తండ్రి విశ్వనాథ్ వాంగ్మూలం ఇచ్చాడు. ఓ న్యూస్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
సంజు శాంసన్ తండ్రికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో నా కొడుకు కెరీర్‌ను 10 సంవత్సరాల నాశనం చేసిన 3-4 మంది ఉన్నారు. ధోనీ, విరాట్, రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ నా కొడుకు పదేళ్లను నాశనం చేశారు. వారు సంజూని బాధపెట్టారు కానీ అతను ఈ సంక్షోభం నుండి కోలుకున్నాడు అని సంజూ తండ్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. 2014లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన సంజూ శాంసన్ ఛాన్స్ లు రాకపోవడంతో ఇప్పటి వరకు పెద్దగా క్రికెట్ ఆడలేకపోయాడు. అయితే ఇప్పుడు తన టాలెంట్ ను బయట పెడుతున్నాడు.
తమిళనాడు మాజీ క్రికెటర్ క్రిష్ శ్రీకాంత్ పై కూడా సంజూ శాంసన్ తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆయన మాట్లాడుతూ, కె. శ్రీకాంత్ వ్యాఖ్యలు నన్ను చాలా బాధించాయి. బంగ్లాదేశ్ లాంటి జట్టుపై సంజూ శాంసన్ సెంచరీ సాధించాడని ఎగతాళి చేశాడు. కానీ సెంచరీ ఏ జట్టు మీద చేసిన సెంచరే. సంజు క్లాసికల్ ప్లేయర్. అతని బ్యాటింగ్ సచిన్, రాహుల్ ద్రవిడ్ లాగా క్లాసిక్. సంజూను ఎంకరేజ్ చేయకపోయినా సరే..కానీ ఇలా కనీస మర్యాద ఇవ్వకుంటే ఎలా? అని సంజూ తండ్రి అసహనం వ్యక్తం చేశాడు. సంజు శాంసన్ తన తండ్రి కారణంగా ఇప్పటికే ఎన్నో సార్లు వివాదాల్లో చిక్కిన సంగతి తెలిసిందే. 2016లో కేరళ క్రికెట్ అసోసియేషన్ అధికారులతో సంజు తండ్రి గొడవపడ్డాడు. ఈ ఆటగాడితో మైదానానికి రావద్దని సంజూ శాంసన్ తండ్రిని అధికారులు హెచ్చరిచారు.