చలికాలం సమస్యలకు కొబ్బరి నూనెతో చెక్.. ముఖానికి అప్లై చేస్తే..
Category : జీవనశైలి |
Sub Category : జీవనశైలి Posted on 2024-11-14 11:32:39
TWM News:-చలికాలంలో చర్మ సంబంధిత సమస్యలు రావడం సర్వసాధారణం. ముఖ్యంగా చర్మం పగుళ్లు, కాంతి హీనంగా మారడం వంటి ఇబ్బందులు వస్తుంటాయి. అయితే ఈ సమస్యలన్నింటికీ కొబ్బరి నూనె బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చని నిపుణులు అంటున్నారు. కొబ్బరి నూనెను ముఖానికి అప్లై చేసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడొచ్చు..
చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా చలికాలం అనగానే చర్మ సంబంధిత సమస్యలు చుట్టుముడుతుంటాయి. ముఖంపై చర్మం ముడతలు, పెదాల పగుళ్లు, పాదాల పగుళ్లు, డెడ్ స్కిన్ సెల్స్ తొలగించలేకపోవడం వంటి ఎన్నో చర్మ సమస్యలు వస్తుంటాయి. అయితే వీటన్నింటికీ కొబ్బరి నూనెతో చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా మార్కెట్లో దొరికే లోషన్స్‌కు బదులుగా కొబ్బరి నూనె ఉపయోగించే చర్మం ఆరోగ్యంగా ఉంటుందని అంటున్నారు. చలికాలం రోజు రాత్రి పడుకునే ముందు ముఖానికి కొబ్బరి అప్లై చేయడం వల్ల మార్పు ఇట్టే కనిపిస్తుందని అంటున్నారు. ఇతకీ రోజూ కొబ్బరి నూనె అప్లై చేస్తే జరిగే ఆ మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా చలికాలం చర్మం పొడిబారుతుండడం సర్వసాధారణమైన విషయం. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు వ్యాజిలిన్‌లో కొంత కొబ్బరి నూనె కలుపుకొని ముఖానికి బాగా అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం తేమగా ఉంటుంది. రాత్రంతా ఉంచుకుని ఉదయాన్నే ముఖాన్ని కడిగితే ముఖం నున్నగా మారి, ప్రకాశవంతంగా మారుతుంది. అలాగే ఇది చర్మానికి మంచి పోషణను అందిస్తుంది.