Category : ఆరోగ్యం | Sub Category : ఆరోగ్యం Posted on 2024-11-14 10:28:10
TWM News:-శంఖం పూలను అపరాజితా పూలు అని కూడా అంటారు. ఆయుర్వేదం ప్రకారం ఈ పూలకు ఎంతో విలువ ఉంది. శంఖం పువ్వును ఆయుర్వేదంలో ఒక ముఖ్యమైన ఔషధంగా పరిగణిస్తారు. ఇది అనేక వ్యాధులకు చికిత్సలో వాడతారు. ఈ పువ్వు ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో, ఈ మొక్కలోని ఔషధ గుణాలు కూడా అంతే ప్రయోజనకరం. ముఖ్యంగా ఈ పూలలో యాంటీఏజింగ్ లక్షణాలు ఎక్కువ. ఇది చర్మాన్ని ముసలితనం బారిన పడకుండా కాపాడతాయి. మీకు మెరిసే ఛాయను అందించడంలో ఈ పూలు ముందుంటాయి. ఈ పూలతో ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి ప్రయత్నించండి.
శంఖం పూలలో శక్తివంతమైన నీలం రంగు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా చర్మం, జుట్టు ఆరోగ్యానికి సహకరిస్తుంది. శంఖం పూలల్లో యాంటీ గ్లైకేషన్ లక్షణాలు ఎక్కువ. ఇవి ఏజింగ్ లక్షణాలు త్వరగా రాకుండా అడ్డుకుంటాయి.
శంఖం పూల టీని ప్రతిరోజూ తాగడం వల్ల చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి పెరిగి ముఖంపై గీతలు, ముడతలు పడవు. శంఖం పూలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని అలెర్జీల నుంచి కాపాడతాయి.
ఈ శంఖం పూలలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు బరువు తగ్గేందుకు కూడా మద్దతు ఇస్తాయి. దీనితో టీ చేసి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి పోషకాలను అందిస్తుంది.
ఇందులో విటమిన్ ఎ, సి, ఇ లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ చర్మంపై పొరని కాపాడడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. శంఖం పూలతో తయారు చేసిన బ్లూ టీ తాగడం మొదలుపెట్టిన పదిహేను రోజుల్లోనే మీకు మంచి మార్పు కనిపిస్తుంది.
ఇందుకోసం శంఖం పూలను బాగా ఎండబెట్టి, గాలి చేరని సీసాల్లో భద్రపరచుకోవాలి. టీ తాగాలనిపించినప్పుడు వాటిలో మూడు, నాలుగు ఎండు పూలను తీసి వేడినీళ్లలో వేసి కాసేపు మరిగించాలి. నీరంతా నీలం రంగులోకి మారుతుంది. ఓ గ్లాసులోకి వడకట్టకుని, అందులో కాస్త తేనె చేర్చుకుని తాగాలి. అలాగే, వీటితో హెయిర్ మాస్క్ లు, ఫేస్ మాస్క్ లు వేసుకుంటే ఎంతో ఉపయోగం ఉంటుంది.