Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2024-11-14 10:10:50
2024 ఎన్నికల తరువాత కాస్త సైలెంట్ మూడులోకి వెళ్లిన జగన్ మళ్ళీ మాటల యుద్ధం మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది. తాజాగా ఆయన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై స్పందించిన.. ఇది బడ్జెట్ లా లేదు కేవలం ప్రజలను మభ్య పెట్టేలా ఉంది అంటూ విమర్శించారు. బడ్జెట్ ప్రవేశ పెడితే తాము చేసిన మోసాలు బయటపడతాయి అనే భయంతోటి ఇన్ని రోజులు ఈ విషయాన్ని సాగదీస్తూ వచ్చి ఇప్పుడు బడ్జెట్ను ప్రవేశపెట్టారు అని కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు కురిపించారు. అంతేకాదు ఎన్నికలకు ముందు వైసీపీ హయాంలో ఆంధ్ర మరో శ్రీలంకలా మారుతుంది అంటూ తప్పుడు ప్రచారం చేశారు అని జగన్ పేర్కొన్నారు. ఈ విషయంలో ఓ చంద్రబాబు దివంగత నేత.. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు నటనను మించిపోయేలా ఉన్నారు అంటూ విమర్శించారు. ఏపీ బడ్జెట్ పై విలేకరులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసిన జగన్.. చంద్రబాబు తీరుపై విమర్శించారు. దానవీరశూరకర్ణ సినిమాలో విభిన్న పాత్రలు పోషించి ఎన్టి రామారావు చేసిన నటనకంటే కూడా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో చంద్రబాబు ఎక్కువ నటిస్తున్నారు అంటూ సెటైర్ల వర్షం కురిపించారు. వైసిపి హయాంలో 10 లక్షల కోట్ల ఉన్న అప్పు ని 14 లక్షల కోట్లకు చేరుకున్నట్లు ప్రచారం చేశారని పేర్కొన్నారు. ఇది కేవలం ఎన్నికలకు ముందు కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఎగగొట్టడానికి వేస్తున్న ఎత్తు అంటూ వ్యాఖ్యానించారు. 2019లో ఆంధ్రాలో తాము అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్రం మొత్తం అప్పు 3 లక్షల 13 వేల కోట్లు ఉంది అని పేర్కొన్న జగన్.. తాము 2024 పదవి దిగిపోవడానికి ముందు ఆ అప్పు 6 లక్షల 46 వేల కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ఇప్పుడు టిడిపి వచ్చిన కొన్ని నెలల సమయంలోనే ఆ అప్పు 19% పెరిగిందని.. ఈ నేపథ్యంలో నిజమైన అప్పుల రత్న బిరుదు ఎవరికి దక్కుతుందో ప్రజలే సమాధానం ఇవ్వాలని అన్నారు.