Responsive Header with Date and Time

మీకు ఆధార్‌ కార్డ్‌ ఉందా.? వెంటనే ఈ పనిచేయండి..

Category : వ్యాపారం | Sub Category : జాతీయ Posted on 2024-11-14 10:04:36


మీకు ఆధార్‌ కార్డ్‌ ఉందా.? వెంటనే ఈ పనిచేయండి..

TWM News:-పెరుగుతోన్న ఆధార్ కార్డు వినియోగంతో పాటు దుర్వినియోగం కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. రోజురోజుకీ ఆధార్ కార్డు ద్వారా మోసాలు పెరుగుతున్నాయి. అయితే ఈ నేరాలకు చెక్ పెట్టేందుకు

ప్రస్తుతం ఆధార్‌ కార్డ్‌ వినియోగం అనివార్యంగా మారింది. ప్రతీ చిన్న పనికి ఆధార్‌ కార్డ్‌ ఉండాల్సిందే. అయితే అదే స్థాయిలో ఆధార్‌ కార్డు దుర్వినియోగం కూడా పెరిగిపోయింది. ఆధార్‌ కార్డు వివరాలతో నకిలీ సిమ్‌లు తీసుకోవడం, బ్యాంకు ఖాతాలు తెరవడం వంటి పనులు చేస్తున్నారు సైబర్‌ నేరగాళ్లు. అయితే మీ ఆధార్‌ కార్డు భద్రంగా ఉండాలంటే ఓ మార్గం అందుబాటులో ఉందని తెలుసా.? మాస్క్‌డ్‌ ఆధార్‌ కార్డు సేవల ద్వారా మీ కార్డు సురక్షితంగా ఉంటుంది. ఇంతకీ ఏంటీ మాస్క్‌డ్‌ ఆధార్‌.? దీనిని ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఆధార్‌ కార్డు దుర్వినియోగానికి చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ మాస్క్‌డ్‌ ఆధార్‌ కార్డును తీసుకొచ్చింది. ఆధార్ కార్డును తప్పనిసరిగా సమర్పించాల్సిన అవసరం లేని.. లేదా ఈకేవైసీ మాత్రమే ఇవ్వాల్సిన చోట మాస్క్‌డ్ ఆధార్ కార్డును ఉపయోగించుకోవచ్చు. ఈ ఆధార్‌ కార్డులో కేవలం చివరి నాలుగు నెంబర్లు మాత్రమే కనిపిస్తాయి. దీంతో ఆధార్‌ దుర్వినియోగాన్ని అరికట్టవచ్చని అధికారులు చెబుతున్నారు.

ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే..

* ఇందుకోసం ముందుగా అధికారిక UIDAI వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

* ఆ తర్వాత డౌన్‌లోడ్‌ ఆధార్‌ కార్డ్‌ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.

* అనంతరం మీ 12 ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, క్యాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేయాలి.

* వెంటనే మీ రిజిస్ట్రేషన్‌ మొబైల్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్‌ చేసిన తర్వాత మాస్క్‌డ్ ఆధార్ కావాలా? అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేయాలి.

* ఆ తర్వాత పీడీఎఫ్‌ రూపంలో మాస్క్‌డ్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ అవుతుంది. అయితే ఈ పీడీఎఫ్‌ ఫైల్ ఓపెన్‌ చేయాలంటే ఓ పాస్ట్‌వర్డ్‌ ఎంటర్‌ చేయాలి. పాస్‌వర్డ్‌ విషయానికొస్తే మీ పేరులోని మొదటి నాలుగు అక్షరాలు, పుట్టిన ఏడాదిని కలపాలి. ఉదాహరణకు మీ పేరు SRIMAN, మీరు పుట్టిన ఏడాది 2020 అనుకుందాం. అప్పుడు మీ పాస్‌వర్డ్‌ SRIM2020 అవుతుంది.


Search
Categories
తాజా వార్తలు
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: