Category : జీవనశైలి | Sub Category : జీవనశైలి Posted on 2024-11-13 17:32:56
TWM News:-కొల్లాజెన్ గురించి అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు. కనుక ఈ రోజు కొల్లాజెన్ అంటే ఏమిటి? దీనిని సప్లిమెంట్ గా ఎలా తీసుకుంటారు..? కొల్లాజెన్ తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు, నష్టాలు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..
కొల్లాజెన్ ఈ పేరును చాలాసార్లు విని ఉంటారు. సెలబ్రిటీలు కూడా తమ చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొల్లాజెన్ ను సప్లిమెంట్ల రూపంలో తీసుకుంటారు. ప్రస్తుతం కొల్లాజెన్ ను బూస్టర్ డోస్‌లుగా తీసుకోవడం లేదా పౌడర్ తీసుకోవడం లేదా కొల్లాజెన్ ఉత్పత్తులను ఉపయోగించడం అనే ట్రెండ్ బాగా పెరిగిపోయింది. అయితే ఇప్పటికీ ఈ కొల్లాజెన్ గురించి అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు. అయితే కొల్లాజెన్ తీసుకుంటే శరీరంలో ఎలా పనిచేస్తుందో తెలుసా.. ఏదైనా సప్లిమెంట్ తీసుకునే ముందు, కొల్లాజెన్ అంటే ఏమిటి? కొల్లాజెన్ పౌడర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం ముఖ్యం.
కొల్లాజెన్ చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది. కొల్లాజెన్ చర్మంలో స్థితిస్థాపకతను నిర్వహించడానికి అవసరం. అంతేకాదు ఇది కణజాలాలను రిపేర్ చేయడం, కణజాలాలను నిర్వహించడం, రోగనిరోధక శక్తిని కాపాడుకోవడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.