Responsive Header with Date and Time

రష్యాపై విరుచుకుపడ్డ ఉక్రెయిన్‌.. మాస్కోపై 36 డ్రోన్లతో అటాక్

Category : అంతర్జాతీయ | Sub Category : వార్తలు Posted on 2024-11-13 12:50:21


రష్యాపై విరుచుకుపడ్డ ఉక్రెయిన్‌.. మాస్కోపై 36 డ్రోన్లతో అటాక్

TWM News:-చాలా రోజుల తరువాత రష్యాపై మెరుపుదాడి చేసింది ఉక్రెయిన్‌. 2022లో రష్యా -ఉక్రెయిన్‌ యుద్దం ప్రారంభమైన తరువాత ఇదే అతిపెద్ద డ్రోన్‌దాడి. తాజాగా జరిగిన దాడిలో ఏ దేశానికి నష్టం వాటిల్లింది..?

రష్యా, ఉక్రెయన్‌ యుద్ధం ఇప్పుడిప్పుడే ముగిసేలా కనిపించడం లేదు. ఇరుదేశాలు పరస్పరం దాడులు, ప్రతిదాడులకు దిగుతున్నాయి. ఉక్రెయిన్‌ ప్రాంతాలపై రష్యా బలగాలు దాడులు చేయగా, దానికి కౌంటర్‌గా ఉక్రెయిన్‌ పెద్ద సంఖ్యలో డ్రోన్లతో ప్రతీదాడులకు దిగింది. రష్యా రాజధాని మాస్కోపై 36 డ్రోన్లతో దాడులకు పాల్పడింది. ఈ దాడిలో రష్యాకు భారీ నష్టం జరిగింది. పలు భవనాలకు డ్యామేజ్‌ అయ్యింది. ఈ దాడిలో చాలామంది పౌరులకు గాయాలయ్యాయి. ఉక్రెయిన్‌ దాడి తరువాత మాస్కో లోని ఎయిర్‌పోర్ట్‌లను మూసేశారు. ఉక్రెయిన్‌ తమ దేశంపై ఉగ్రదాడికి పాల్పడిందని రష్యా ఆరోపించింది. మాస్కోను లక్ష్యంగా చేసుకొని ఉక్రెయిన్‌ డ్రోన్లను ప్రయోగించిందన్నారు రష్యా అధికారులు.

డ్రోన్‌ దాడుల కారణంగా మాస్కోలోని డొమోడెడోవో, జుకోవో విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చిందన్నారు. దాడుల కారణంగా ప్రాణ నష్టం జరగలేదని.. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు రష్యా అధికారులు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందిస్తూ, రష్యా ఇటీవల తమ దేశంపై 145 డ్రోన్లతో దాడి చేసిందని ఆరోపించారు. మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలుపెట్టి రెండున్నరేళ్లు దాటింది. ఇప్పటికీ ఇరుదేశాలు పరస్పర దాడులతో విరుచుకుపడుతున్నాయి. రెండువైపులా పెద్దఎత్తున మరణాలు సంభవిస్తున్నాయి. అయితే, యుద్ధం మొదలైనప్పటినుంచి చూస్తే ఈ ఏడాది అక్టోబరులో పుతిన్‌ సేనలు అత్యధిక ప్రాణనష్టం చవిచూసినట్లు తెలుస్తోంది.

Search
Categories
తాజా వార్తలు
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: