Category : సినిమా | Sub Category : సినిమా Posted on 2024-11-13 11:35:50
జీబ్రా మెగా ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. కొన్ని ఫంక్షన్స్ కి రావడం ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. ప్రేమతో పిలిస్తే వస్తాను. నాకు ప్రేమ కావాలి, అభిమానం కావాలి. ఇక్కడ ఆ ప్రేమ అభిమానం మెండుగా లభిస్తుంది. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ అంత ప్రేమ అభిమానం కురిపిస్తుంటే అది ఆస్వాదించడానికి నేను వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ వేడుక ఇంత ఘనంగా జరగడానికి కారణమైన మీ అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. కోవిడ్ సమయంలో ఎలాంటి సినిమాలు తీసి జనాలని రంజింపచేయాలనే ఒక మీమాంస ఇండస్ట్రీలో నెలకొంది. జనాలు ఓటీటీలో సినిమాలు చూడడం అలవాటు చేసుకున్న తర్వాత, పెద్ద సినిమాలకు, బిగ్ ఈవెంట్ సినిమాలి తప్పితే వాళ్ళని థియేటర్స్ కి రప్పించడం చాలా కష్టమనే అభిప్రాయం వ్యక్తమైనప్పుడు ఇండస్ట్రీకి ఐడెమ్ కష్టకాలం అనిపించింది.పెద్ద సినిమాలు ఆడినంత మాత్రాన అది ఇండస్ట్రీ కాదు, ఇక్కడ అన్ని సినిమాలు ఆడాలి, షూటింగ్ లు జరుపుకోవాలని, ఉపాధి కల్పించాలి, ప్రతి ఒక్కరూ కళకళలాడాలి, అప్పుడే పరిశ్రమ సజావుగా కొనసాగుతూ ఉంటుందనే నాలాంటి వాళ్లకు ఒక చిన్న బెరుకు వచ్చింది. అయితే అవన్నీ కూడా కరెక్ట్ కాదని ప్రేక్షకులు నిరూపించారు. దానికి ఉదాహరణగా ఈ సంవత్సరం ప్రశాంత్ వర్మ, తేజసజ్జా కలయికలో హనుమాన్ తో శుభారంభమైంది. అది ఆల్ ఇండియా సినిమాగా గొప్ప విజయం సాధించింది. చిన్న సినిమాలని పెద్ద సినిమాలుగా మార్చారు మన తెలుగు ప్రేక్షకులు. తర్వాత వచ్చిన కమిటీ కుర్రాళ్ళు, డిజె టిల్లు 3, ఆయ్, మత్తువదలరా 2 ఇలా వరుసగా సినిమాలో సూపర్ హిట్ అవుతూ వచ్చాయి. మొన్న దీపావళికి లక్కీ భాస్కర్, క, అమరన్ ఎంతో ఆదరణ పొందాయి. ఈరోజు కంటెంట్ ఆయుపట్టు. కంటెంట్ బాగుండాలి. సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉండాలి. అది ఆస్వాదించడానికి ప్రేక్షకులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. సినిమాలు ఆడవు ప్రేక్షకులు ఓటీటికి అలవాటు పడిపోయారనే మాట అవాస్తవం. సినిమా బాగుంటే ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తారు. సినిమాని వాళ్ళకి మెప్పించేలా మనం చాకచక్యంగా తీయాలి.
జీబ్రా ట్రైలర్ చూసినప్పుడు మంచి కంటెంట్ తో ఉందని అర్థమవుతుంది ఇందులో చాలా మంచి ఎంటర్టైన్మెంట్, స్టార్ కాస్ట్ ఉంది. వండర్ఫుల్ యాక్టర్స్ ఉన్నారు. మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటు క్రైమ్ ఎలిమెంట్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. కచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ బొమ్మ అవుతుంది. ఇందులో సత్య, ధనుంజయ, సత్యరాజ్ ఇలా చాలా మంచి నటులు ఉన్నారు. డాలీ తెలుగులో మంచి నటుడుగా స్థిరపడతాడని నమ్మకం ఉంది. సత్యదేవ్ నాకు ఇంకో తమ్ముడు. తను చూపించే ప్రేమలో ఎక్కడా కల్మషం ఉండదు. నిజమైన ఎమోషన్ ఉంటుంది. తను చెప్పినవన్నీ సత్యాలు. తన సినిమాలు చూస్తున్నప్పుడు చాలా ఇంటెన్సుగా పెర్ఫార్మన్స్ చేస్తున్నాడు అనిపిస్తుంది. తన వాయిస్ లో రిచ్ నెస్ వుంది. తన మొదటి చూసినప్పుడు నేను తెలుగు యాక్టర్ అనుకోలేదు. కానీ తను మన వైజాగ్ అబ్బాయి తెలిసినప్పుడు తనతో మాట్లాడాలనుకున్నాను. అప్పుడే తను నేనంటే ఎంత ఇష్టమో చెప్పాడు.అప్పటి నుంచి మేము అప్పుడప్పుడు కలుస్తూనే ఉన్నాం. తను చాలా మంచి యాక్టర్. అయితే తనకి సరైన సినిమాలు పడటం లేదనిపించేది. గాడ్ ఫాదర్ లో విలన్ రోల్ లో తను అత్యద్భుతంగా చేస్తాడాని నాకు నమ్మకం. నేను నమ్మకం పెట్టుకున్నట్లే ఆ సినిమాలో అతను అద్భుతంగా రాణించాడు. ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. సత్యదేవ్ లాంటి వెర్సటైల్ యాక్టర్స్ మనకి తెలుగులో కరువైపోయారు. తనకి భవిష్యత్తులో బోలెడన్ని అవకాశాలు వస్తాయి. జీబ్రాలో తను చాలా షటిల్డ్ పెర్ఫార్మన్స్ తో చేశాడు. తనకి మరింత బ్రైట్ ఫ్యూచర్ ఏర్పడుతుందని భావిస్తున్నాను. తమ్ముడు సత్యదేవ్ కి ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తున్నాను. నిర్మాతలు బాల, దినేష్, ఎస్ ఎన్ రెడ్డి గారు చాలా ప్యాషన్ తో ఈ సినిమా తీశారు. డైరెక్టర్ ఈశ్వర్ కార్తీక్ చాలా వండర్ఫుల్ గా ఈ సినిమాను తీశారు. టీమ్ అందరికీ ఈ సినిమా అద్భుతమైన విజయం చేకూర్చాలని కోరుకుంటున్నాను. టీం లో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ అన్నారు.