Responsive Header with Date and Time

రెండు ఖండాలు.. మూడు దేశాలు.. దశాబ్దాల తర్వాత తొలిసారిగా భారత ప్రధాని..!

Category : అంతర్జాతీయ | Sub Category : వార్తలు Posted on 2024-11-13 11:21:57


రెండు ఖండాలు.. మూడు దేశాలు.. దశాబ్దాల తర్వాత తొలిసారిగా భారత ప్రధాని..!

TWM News:-ప్రధాని నరేంద్ర మోదీ రెండు ఖండాల పర్యటన వివిధ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచ వేదికపై భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు ఖండాల్లో మూడు దేశాలు పర్యటించనున్నారు. నవంబర్ 16 నుంచి 21 వరకు ఆయన ఆఫ్రికా ఖండంలోని నైజీరియాతో పాటు దక్షిణ అమెరికా ఖండంలోని బ్రెజిల్, గయానా దేశాలను సందర్శించనున్నారు. గ్లోబల్ సౌత్ నినాదంతో ప్రపంచంలోని దక్షిణ దిక్కున ఉన్న దేశాల గళాన్ని బలంగా వినిపిస్తున్న ప్రధాని మోదీకి ఈ మూడు దేశాల పర్యటన వ్యూహాత్మక ప్రాధాన్యతగా మారింది. ఆయా దేశాలతోనే కాదు, ఆ ఖండాలతోనే సంబంధాలను మరింత మెరుగుపరుచుకోవడంలో ఈ పర్యటన కీలకంగా మారనుంది.

17 ఏళ్ల తర్వాత ప్రధానమంత్రి పర్యటన

ప్రధాని మోదీ నైజీరియా పర్యటన విశేషాలను గమనిస్తే.. 17 ఏళ్ల తర్వాత భారత ప్రధాని తొలిసారిగా నైజీరియాలో పర్యటిస్తున్నారు. ఆ దేశ అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబు ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతోంది. ప్రధాని మోడీ, నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబు మధ్య వివిధ అంశాలపై చర్చలు జరుగుతాయి. ఇవి రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించడం, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో దోహదపడతాయి. భారత్, నైజీరియా దేశాలు 2007 నుంచి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. ఇందులో భాగంగా ఆర్థిక, ఇంధన, రక్షణ రంగాల్లో సహకారం అందించే ఒప్పందాలు కూడా ఉన్నాయి. దాదాపు 200 భారతీయ కంపెనీలు నైజీరియాలో ఇప్పటికే 27 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టాయి. ప్రధాని మోదీ ఇక్కడ భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. మోదీ పర్యటన రెండు దేశాల మధ్య సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది.

బ్రెజిల్ G20 సమ్మిట్‌లో భారత గళం

నవంబర్ 18, 19 తేదీల్లో బ్రెజిల్‌లోని రియోడిజనీరో నగరంలో జరగనున్న జి20 సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటారు. గతేడాది జీ-20 సదస్సును భారత్ విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆ సదస్సుకు బ్రెజిల్‌ వేదికైంది. ప్రస్తుతం బ్రెజిల్, దక్షిణాఫ్రికాతో పాటు భారతదేశం కూడా G20 ట్రోకాలో భాగంగా ఉంది. ఈ సమ్మిట్‌లో ప్రధాని మోదీ ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన వివిధ అంశాలపై భారతదేశ వైఖరిని వ్యక్తపరుస్తారు. భారతదేశంలో G20 న్యూఢిల్లీ లీడర్స్ స్టేట్‌మెంట్ ఫలితాలను కూడా సమీక్షిస్తారు. అంతే కాకుండా జి-20లో పాల్గొనేందుకు వచ్చిన పలువురు ప్రపంచ నేతలతో కూడా ప్రధాని ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు.

56 ఏళ్ల తర్వాత గయానాకు భారత ప్రధాని

1968 తర్వాత భారత ప్రధాని గయానాలో పర్యటించడం ఇదే తొలిసారి కావడంతో ప్రధాని మోదీ గయానా పర్యటన చారిత్రక సందర్భంగా మారింది. గయానా అధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ ఇర్ఫాన్ అలీ ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతోంది. గయానాలో వలస పాలకుల కారణంగా భారత సంతతి ప్రజలు శతాబ్దాల క్రితమే వెళ్లి స్థిరపడ్డారు. అక్కడి జనాభాలో 31 శాతం హిందువులు ఉన్నారు. 2023లో ప్రెసిడెంట్ అలీ ఇండోర్‌లో జరిగిన 17వ ప్రవాసీ భారతీయ దివస్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రవాసీ భారతీయ సమ్మాన్‌తో ఆయన్ను సన్మానించారు. గయానాలో భారత ప్రధాని మోదీ, ఆ దేశాధ్యక్షుడు అలీ, ఇతర సీనియర్ నాయకులతో కీలక చర్చలు జరుపుతారు. అలాగే గయానీస్ పార్లమెంటును ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. భారతీయ ప్రవాసుల ప్రధాన సమావేశంలో కూడా ప్రధాని పాల్గొంటారు. ప్రధాన మంత్రి ఇక్కడ జరిగే రెండవ CARICOM-ఇండియా సమ్మిట్‌లో కూడా పాల్గొంటారు. CARICOM సభ్యదేశాల నాయకులతో సమావేశాలు నిర్వహిస్తారు. ఇది కరేబియన్ ప్రాంతంతో భారతదేశ స్నేహబంధాన్ని మరింతగా బలోపేతం చేయనుంది.

Search
Categories
తాజా వార్తలు
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: