Category : ఆరోగ్యం | Sub Category : ఆరోగ్యం Posted on 2024-11-13 11:20:15
TWM News:-ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లను చాలా ముఖ్యమైన పోషకాలుగా పరిగణిస్తారు.. శరీరంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లోపం ఉంటే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే.. కొన్ని చేపలు, విత్తనాలు, గింజలు ఒమేగా-3లను పొందడానికి సహాయపడతాయి.. అయితే.. చేపలు తినని వారు శాకాహారం ద్వారా దీన్ని ఎలా పొందాలో ఈ కథనంలో తెలుసుకోండి..
మన శరీరానికి అవసరమైన పోషకాలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఒకటి.. ఇవి ఆరోగ్యంగా ఉండేందుకు, శరీర నిర్మాణానికి చాలా అవసరం.. ఒమేగా 3 రక్తపోటును తగ్గిస్తుంది, రక్తంలో ట్రైగ్లిజరైడ్‌లను తగ్గిస్తుంది.. రుమటాయిడ్ వ్యాధిలో కీళ్ల వాపును తగ్గిస్తుంది.. మెదడు, కళ్ళ పనితీరును మెరుగుపర్చడంలో సహాయపడుతుంది. చిత్తవైకల్యం, డిప్రెషన్, ఆస్తమా, మైగ్రేన్, మధుమేహాన్ని నివారించడంలో, తగ్గించడంలో సహాయపడుతుంది.. గుండె సమస్యలను ను నివారించడంలో సహాయపడుతుంది. అయితే.. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కొన్ని రకాల చేపలు, విత్తనాలు, గింజలు.. మీకు మరింత ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పొందడానికి సహాయడతాయి..
సాధారణంగా.. సాల్మన్, మాకేరెల్, ట్యూనా, సార్డిన్ వంటి చేపలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి.. అయితే ప్రతి ఒక్కరికీ కొవ్వు చేపలను తినడం సాధ్యం కాదు.. కాబట్టి శాఖాహారం తినే వారు ఏమి చేయాలి..? ఈ పోషకాన్ని పొందడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను పొందగల శాఖాహార ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకోండి..
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే శాఖాహారాలు..
సోయాబీన్: సోయాబీన్‌ను ప్రోటీన్ అవసరాలను తీర్చడానికి తింటారు.. కానీ ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కూడా ఇందులో పుష్కలంగా లభిస్తాయి.. ఇది గుండెను రక్షించడంలో సహాయపడుతుంది.. ఎముకలు కూడా బలపడతాయి.
చియా విత్తనాలు: చియా విత్తనాలు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్.. ముఖ్యంగా ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ ఉత్తమ మొక్కల ఆధారిత వనరులలో ఒకటి. ఇది మెదడు ఆరోగ్యానికి చాలా అవసరం.. వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
వాల్‌నట్: శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి శీతాకాలంలో వాల్‌నట్‌ను ఎక్కువగా తింటారు. ఇది ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్‌ల మధ్య అద్భుతమైన సమతుల్యతను అందిస్తుంది. వాల్‌నట్‌లను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
అవిసె గింజలు: అవిసెగింజలను ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ అని పిలువబడే ఒమేగా -3 కొవ్వు ఆమ్లం.. అద్భుతమైన మూలంగా పరిగణిస్తారు. ఇది మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గుండె జబ్బులను కూడా నివారిస్తుంది. ఇది కాకుండా, జుట్టు, చర్మ సౌందర్యాన్ని ప్రోత్సహిస్తుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)