Responsive Header with Date and Time

జలుబు, ముక్కు దిబ్బడ లేకుండా ముక్కు వాసన సామర్ధ్యాన్ని కోల్పోయిందా.. 100 కంటే ఎక్కువ వ్యాధుల ప్రారంభానికి సంకేతమట..

Category : ఆరోగ్యం | Sub Category : ఆరోగ్యం Posted on 2024-11-13 11:17:55


జలుబు, ముక్కు దిబ్బడ లేకుండా ముక్కు వాసన సామర్ధ్యాన్ని కోల్పోయిందా.. 100 కంటే ఎక్కువ వ్యాధుల ప్రారంభానికి సంకేతమట..

TWM News:-జలుబు చేసినప్పుడు లేదా ముక్కు ముసుకు పోయి ఇబ్బంది పడుతున్న సమయంలో వాసన పెద్దగా తెలియదు. ఇది జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తినప్పుడు ఒక సాధారణ లక్షణం. అయితే ఈ లక్షణం 100 కంటే ఎక్కువ వ్యాధుల ప్రారంభ సంకేతం. అందువల్ల ఎక్కువ రోజులు వాసన తెలియక పోతే ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి, ఎందుకంటే ఒక పరిశోధన ప్రకారం, ఇది అనేక రకాల వ్యాధుల వల్ల కావచ్చు.

శీతాకాలంలో చలికి ముక్కు దిబ్బడ వేయడం.. వాసన తెలియక ఇబ్బంది పడడం సర్వ సాధారణం. ఇక కోవిడ్‌ వ్యాప్తి సమయంలో వాసన తెలియక పొతే అది కరోనా వైరస్ ప్రధాన లక్షణంగా పేర్కొన్నారు. చెడు వాసన తెలియక పోవడం అనే లక్షణం ఒక నిర్దిష్ట సమయంలో కలగవచ్చు. అయితే కొన్ని వ్యాధులు ప్రారంభ దశలో కూడా ఎటువంటి వాసనను గుర్తించలేరు.

ముక్కు పంచేద్రియాల్లో ఒకటి. మనం ముక్కు ఊపిరి పీల్చుకుంటాం అదేవిధంగా వాసన చూస్తాం. అయితే కొన్ని వ్యాధుల కారణంగా ముక్కు తన పని పనిచేయడం ఆగిపోతుంది. వాసన చూడగల సామర్థ్యం పోతుంది. ఫ్రాంటియర్స్ ఇన్ మాలిక్యులర్ న్యూరోసైన్స్‌లో ప్రచురించబడిన ఇటీవలి పరిశోధన ప్రకారం.. శరీరంలో 139 వ్యాధుల లక్షణాలు ఉన్నాయని.. వీటిలో ఏదైనా సరే ముక్కు వాసనను పసిగట్టే సామర్ధ్యంపై ప్రభావం చూపిస్తుందని వెల్లడించింది.

చార్లీ డన్‌లప్ స్కూల్ ఆఫ్ బయోలాజికల్ సైన్సెస్‌లోని పరిశోధకులు.. హ్యుమానిటీస్‌లోని ఆక్స్‌ఫర్డ్ రీసెర్చ్ సెంటర్‌తో కలిసి ముక్కు స్మెల్ తీరుపై పలు పరిశోధనలు నిర్వహించారు, ఇందులో 139 వ్యాధి లక్షణాలు మనిషి వాసన చూసే సామర్థ్యంతో నేరుగా సంబంధం కలిగి ఉన్నట్లు కనుగొనబడింది. ఈ వ్యాధి లక్షణాల వలన రోగి ఏ రకమైన వాసనను గుర్తించలేడు. ఈ లక్షణం చాలా సాధారణమైనదిగా పరిగణించబడుతున్నప్పటికీ .. ఇది వివిధ నరాల, శారీరక వ్యాధుల ప్రారంభ సంకేతం. ముఖ్యంగా జ్ఞాపకశక్తికి సంబంధించినదని పరిశోధనల ద్వారా గుర్తించినట్లు చెబుతున్నారు.

ఏ వ్యాధులకు సంబంధించినది అంటే

వాసన గుర్తించక పోవడం అనేది అల్జీమర్స్,పార్కిన్సన్స్ వంటి వ్యాధులకు కూడా సంబంధించినది. అంతేకాదు మల్టిపుల్ స్క్లెరోసిస్, డిమెన్షియా, కరోనావైరస్ (COVID-19), సైనసిటిస్ వంటి ప్రధాన వ్యాధులతో కూడా సంబంధం ఉన్నట్లు పరిశోధనలో కనుగొనబడింది. ఈ పరిశోధన ప్రకారం ఏ వ్యక్తి అయినా ఏదైనా వాసనను గుర్తించ లేకపోతుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి ఎందుకంటే.. ఇది కొన్ని రకాల వ్యాధుల ప్రారంభ సంకేతం కావచ్చు.రోగికి సకాలంలో చికిత్స అందించి వ్యాధి ముదిరిపోకుండా నివారించవచ్చు.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలంటే

కొంత సమయం వరకు వాసన కోల్పోవడం ప్రమాదకరమైన సంకేతం కాదని వైద్యులు చెప్పారు. అయితే ఎవరైనా సరే ముక్కు దిబ్బడ, జలుబు వంటి ఇబ్బందులు లేకుండా ఎక్కువ కాలం ముక్కు ఎటువంటి వాసనను గుర్తించలేకపోతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. తద్వారా ఎన్నో వ్యాధులకు ప్రారంభంలోనే సరైన చికిత్స తీసుకోవచ్చు అని చెబుతున్నారు


Search
Categories
తాజా వార్తలు
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: