Responsive Header with Date and Time

రెయిన్‌బో డైట్‌.. ఎప్పుడైనా ట్రై చేశారా ?? దీన్ని ఫాలో అయితే కలిగే లాభాలేంటంటే ??

Category : ఆరోగ్యం | Sub Category : ఆరోగ్యం Posted on 2024-11-13 11:15:44


రెయిన్‌బో డైట్‌.. ఎప్పుడైనా ట్రై చేశారా ?? దీన్ని ఫాలో అయితే కలిగే లాభాలేంటంటే ??

TWM News:-రెయిన్ బో డైట్ లో రంగు రంగుల పండ్లు, కూరగాయలు ఉంటాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ల శాతం ఎక్కువ. రెయిన్ బో డైట్ ను ఫాలో అయితే శరీరం శుద్ది అవుతుంది. గుండె ఆరోగ్యం, మెదడు ఆరోగ్యం బలపడుతుంది. రెయిన్ బో డైట్ లో మొక్కల ఆధారిత ఆహారాలు ఎక్కువగా ఉంటాయి. ఒక్కో రంగులో ఒకో రకమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఉదాహరణకు.. ఎరుపు రంగులో లైకోపీన్ ఉంటుంది, ఊదా రంగులో ఆంథోసైనిన్ లు ఉంటాయి. ఇలా వివిధ రంగులలో వివిధ పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ రెయిన్ బో డైట్ ఎంత వయసు పెరిగినా అందంగా కనిపించాలని అనుకునే వారికి, డయాబెటిస్ ఉన్నవారికి చాలా మంచిదట. రెయిన్ బో డైట్ లో ఫైబర్ చాలా ఉంటుంది. ఇది గట్ మైక్రోబయోమ్‌కు సహాయపడుతుంది. జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. వీలైనంతవరకు రెయిన్ బో డైట్ లో ఆకుకూరలను ఎక్కువగా తినాలి. ఇవి పేగు కదలికలకు చాలా మంచివి. విటమిన్-సి, విటమిన్-ఇ అధికంగా ఉన్న సిట్రస్ పండ్లు, ఆకుకూరలు గుండె ఆరోగ్యాన్ని బలపరుస్తాయి. వీటిలో సహజ సమ్మేళనాలు ఉంటాయి. మంటను తగ్గిస్తాయి. శరీరాన్ని ఆక్సీకరణ నష్టం నుండి కాపాడతాయి.


Search
Categories
తాజా వార్తలు
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: