Category : ఆరోగ్యం | Sub Category : ఆరోగ్యం Posted on 2024-11-13 11:14:23
TWM News:-తలనొప్పి వచ్చిందంటే ప్రతి ఒక్కరూ ఓ ట్యాబ్లెట్ వేసుకుని, కప్పు కాఫీ తాగి సేద తీరుతుంటారు. కానీ ఈ అలవాటు అంత మంచిది కాదు. సుధీర్ఘకాలం మందులు వాడితో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు..
ఇటీవల కాలంలో ప్రజల జీవన శైలిలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వృత్తిపరమైన ఒత్తిడితో పాటు వ్యక్తిగత కారణాల వల్ల తీవ్ర మానసిక అలసటకు గురవుతున్నారు. ఈ విధమైన జీవనశైలి వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీసింది. ఇందులో తలనొప్పి అనేది ఒక సాధారణ సమస్య. ఇది ఏ వయస్సులోనైనా సంభవించవచ్చు. ఇది కొందరిలో ఎక్కువగా కనిపిస్తే.. మరికొందరిలో అప్పుడప్పుడు రావచ్చు. కానీ ఈ నొప్పి రోజువారీ కార్యకలాపాలపై ప్రభావం చూపుతుంది. దీనికి ఒత్తిడి, పెరిగిన ఆందోళన, అలసట, అధిక పని, చెడు అలవాట్లు వంటి అనేక కారణాలు ఉండవచ్చు. కొన్నిసార్లు కారణం లేకుండా కూడా రావచ్చు.
కానీ చాలా మంది తలనొప్పి వచ్చినప్పుడు నొప్పి నివారణకు మాత్రలు తీసుకుంటారు. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అలాగే ఈ పెయిన్ రిలీవర్ మాత్రలు వివిధ దుష్ప్రభావాలను కలిగిస్తాయి. మీరు కూడా ఈ రకమైన సమస్యను ఎదుర్కొంటుంటే తలనొప్పిని తగ్గించుకోవడానికి మాత్రలు వేసుకునే బదులు, ఈ కింది ప్రత్యేకమైన హోం రెమెడీస్ ప్రయత్నించవచ్చు. తద్వారా నొప్పి సమస్యను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
హైడ్రేటెడ్‌గా ఉండండి
తలనొప్పికి ఒక సాధారణ కారణం డీహైడ్రేషన్. రోజూ కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగడం వల్ల డీహైడ్రేషన్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. తలనొప్పిని కూడా తగ్గిస్తుంది.
యోగా – ధ్యానం
మానసిక ఆరోగ్యానికి యోగా – ధ్యానం చాలా మంచిది. ఇది సాధారణ రోజుల్లో కూడా చేయాలి. రోజూ ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా తలనొప్పిని దూరం చేసుకోవచ్చు.
నట్స్ తినాలి
ఇవి మానసిక ఆరోగ్యానికి కూడా మంచిదని నిపుణులు భావిస్తారు. వాల్ నట్స్, బాదం, జీడిపప్పు తినడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. ఎందుకంటే వాటిలో మంచి మెగ్నీషియం ఉంటుంది. ఇది తలనొప్పిని దూరం చేస్తుంది.
అల్లం టీ
అల్లం టీ తాగడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది తలనొప్పిని తగ్గిస్తుంది. చాలా మందికి అల్లం టీ మానసిక నొప్పి నివారిణిగా పనిచేస్తుంది.
తగినంత విశ్రాంతి
మీకు తరచుగా తలనొప్పి వస్తుంటే మాత్రం తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది మనస్సు ప్రశాంతంగా ఉండటానికి సహాయపడుతుంది. కాబట్టి బాగా నిద్రపోవడానికి ప్రయత్నించాలి.
నోట్: ఇక్కడ ఇచ్చిన విషయాలు సమాచారం కోసం మాత్రమే. ఏవైనా సందేహాలు ఉంటే, నిపుణులను సంప్రదించండి..