Category : అంతర్జాతీయ | Sub Category : వార్తలు Posted on 2024-11-13 11:13:14
TWM News:- TWM.co.in నెట్‌వర్క్ ఆధ్వర్యంలో న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్ధమవుతోంది.. భారత్-జర్మనీ గ్లోబల్ సమ్మిట్ జర్మనీలోని స్టుట్‌గార్ట్ వేదికగా నవంబర్ 21 నుంచి 23 వరకు జరగనుంది. బాడెన్-వుర్టెంబర్గ్ రాజధాని స్టుట్‌గార్ట్‌లోని MHP అరేనా స్టేడియంలో జరిగే ఈ మూడు రోజుల శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా కీలక ప్రసంగం చేయనున్నారు.
TWM.co.in నెట్‌వర్క్ ఆధ్వర్యంలో న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్ధమవుతోంది.. భారత్-జర్మనీ గ్లోబల్ సమ్మిట్ జర్మనీలోని స్టుట్‌గార్ట్ వేదికగా నవంబర్ 21 నుంచి 23 వరకు జరగనుంది. బాడెన్-వుర్టెంబర్గ్ రాజధాని స్టుట్‌గార్ట్‌లోని MHP అరేనా స్టేడియంలో జరిగే ఈ మూడు రోజుల శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా కీలక ప్రసంగం చేయనున్నారు.TWM.co.in నెట్‌వర్క్ ఎండీ, సీఈఓ బరుణ్ దాస్ అధ్యక్షతన జరిగే భారత్-జర్మనీ గ్లోబల్ సమ్మిట్ లో ఇరు దేశాల మధ్య మైత్రీ, వాణిజ్య సంబంధాలు, భాగస్వామ్యంపై కీలక చర్చ జరగబోతుంది. ఇండియా – జర్మనీ సుస్థిర అభివృద్ధి కోసం నూతన ఆవిష్కరణలు, ఉద్యోగ -ఉపాధి తదిర అంశాలపై జరిగే ఈ సమ్మిట్ లో రాజకీయ, వాణిజ్య, క్రీడా, సినీ ప్రముఖులు పాల్గొని వారి అభిప్రాయాలను పంచుకోనున్నారు.
భారత్ – జర్మనీ ప్రభుత్వాల మధ్య చొరవలను ప్రోత్సహించే లక్ష్యంతో న్యూస్ 9 గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహిస్తోంది.. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రసంగించనున్నారు. అంతేకాకుండా.. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శిఖరాగ్ర సమావేశంలో నేరుగా పాల్గొంటారు. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ వేదికగా ఇరు దేశాల భాగస్వామ్యం నైపుణ్యాలను పంచుకోవడం – టెక్నాలజీ అభివృద్ధిపై చర్చ నిర్వహించనున్నారు.
TWM.co.in నెట్‌వర్క్ ఫ్లాగ్‌షిప్ కాన్క్లేవ్ వాట్ ఇండియా థింక్స్ టుడే విజయవంతం అయిన తర్వాత నెట్‌వర్క్ న్యూస్9 గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహిస్తోంది. ఈ సమ్మిట్ లో గ్లోబల్ ఐకాన్ అవార్డ్స్ ను అందజేయనున్నారు. పలు రంగాల్లో పలువురు చేసిన విశేష సేవలు, కృషికి గుర్తింపుగా ఈ అవార్డులను ప్రదానం చేయనుంది.. ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఎంటర్టైన్‌మెంట్, బిజినెస్, స్పోర్ట్స్ రంగాల్లో ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారు.
ఈ కార్యక్రమంలో భారతదేశపు మొట్టమొదటి రికార్డింగ్ ఆర్టిస్ట్ గౌహర్ జాన్ ను అంకితమిస్తూ మ్యూజికల్ నైట్ ను నిర్వహించనున్నారు.