Category : ఆరోగ్యం | Sub Category : ఆరోగ్యం Posted on 2024-11-13 11:11:11
TWM News:-హెచ్.పైలోరీ వల్ల కలిగే నష్టాలు ప్రపంచానికి తెలియజేసేందుకు.. ఆ బ్యాక్టీరియాను తనకు తానే ఎక్కించుకుని, తన ఉదరాన్నే ప్రయోగశాలగా మార్చిన వ్యక్తి ఆయన! హెచ్ పైలోరీ’ బ్యాక్టీరియాపై పరిశోధనల కోసం తొలిసారిగా ప్రత్యేక కేంద్రాన్ని హైదరాబాద్ లో నెలకొల్పారు. దీనిని బారీ మార్షల్ ప్రారంభించారు. ఈ సెంటర్ కు ‘బ్యారీ మార్షల్ సెంటర్’గా అని పేరు పెట్టారు. అపరిశుభ్రత, కలుషిత తాగునీరు తదితర కారణాలతో ఈ బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందన్నారు. ఇంట్లో ఒకరికి సోకితే..మిగతా వారూ దీని బారినపడే ముప్పు ఉంది. ‘హెచ్ పైలోరీ’ సోకినప్పటికీ 80% మందిలో ఎలాంటి లక్షణాలు ఉండవు. కొద్దిమందిలో మాత్రం అజీర్తి, పొట్టలో నొప్పి, గ్యాస్ తదితర ఇబ్బందులుంటాయి. ఒక శాతం మందిలో మాత్రమే దీర్ఘకాలంలో ఇది పొట్ట క్యాన్సర్‌కూ దారి తీసే ఛాన్సుంది. కుటుంబంలో ఎవరైనా క్యాన్సర్ బారినపడిన చరిత్ర ఉంటే.. మిగతా సభ్యులు వెంటనే ఈ బ్యాక్టీరియా పరీక్షలు చేసుకుంటే మంచిది.