Category : ఆరోగ్యం | Sub Category : ఆరోగ్యం Posted on 2024-11-13 11:03:38
TWM News:-చాలా మందికి వేడి వేడి టీతో రస్క్‌లను తినడం అలవాటు. కానీ ఈ అలవాటు అంత మంచిదికాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. పైగా ఇది ప్రాణాంతక వ్యాధులను ఆహ్వానించినట్లు అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే వీటి తయారీకి వినియోగించే పదార్ధాలు దాదాపు విషంతో సమానం..
వేడి వేడి టీతో రస్క్‌లను ఆస్వాదించడం మనలో చాలా మందికి అలవాటు. రోజూ ఉదయం టీతో పాటు రస్క్‌లు, బిస్కెట్లు తినడానికి చాలా మంది ఇష్టపడతారు. ఈ చిరుతిండిని సాయంత్రం పూట కూడా తింటుంటారు. చాలామంది దీనిని ఆరోగ్యకరమైన చిరుతిండిగా భావిస్తారు. అయితే రస్క్‌లు మన ఆరోగ్యానికి నిజంగా ప్రయోజనకరమా? రోజూ తింటే ఏమవుతుంది? అనే విషయాలు నిపుణుల మాటల్లో మీకోసం..
రస్క్‌లలో ఆరోగ్యానికి హాని కలిగించే అనేక రకాల అంశాలు ఉంటాయి. సరళంగా చెప్పాలంటే, ఇది శరీరంలోకి నెమ్మదిగా ప్రవేశించే విషం లాంటిది. మీ ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇది పిండి, చక్కెర, చౌక నూనెల మిశ్రమంతో తయారవుతుంది. ఇందులో చాలా ట్రాన్స్ ఫ్యాట్, షుగర్ ఉంటాయి. కనుక ఇది గుండె ఆరోగ్యానికి, శరీర బరువుకు ప్రమాదకరం. అంతేకాకుండా ఇందులో ఉండే గ్లూటెన్ ఆరోగ్యానికి హానికరం.
దుకాణాల్లో లభించే రస్క్‌లు ఎక్కువగా పాత బ్రెడ్‌తో తయారు చేస్తారు. ఇది శరీర ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఈ రస్క్ తయారీలో ఉపయోగించే నూనెలు చాలా చౌకగా ఉండటమే కాకుండా నాణ్యత కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి గుండె జబ్బులకు దారితీస్తాయి. ఇందులో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి శరీరంలోని జీవక్రియలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ట్రాన్స్ ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని మరింత పెంచుతుంది.
ఇందులో చక్కెర, మైదా పిండిని పెద్ద మొత్తంలో తీసుకోవడం వలన బరువు పెరుగటం, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం జరుగుతాయి. అందుకే టీతో రస్క్‌ను తీసుకోకుండా, ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.
బదులుగా.. వేయించిన మఖానా, వేయించిన వేరుశెనగలను టీతో తినవచ్చు. ఇవి పౌష్టికాహారం మాత్రమే కాకుండా బరువు నియంత్రణలో కూడా సహాయపడతాయి. ఈ స్నాక్స్ మీ శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.