Category : ఆరోగ్యం | Sub Category : ఆరోగ్యం Posted on 2024-11-13 11:01:55
TWM News:-పైనాపిల్ పండులో విటమిన్ బి6, ఫోలేట్, మాంగనీస్, కాపర్, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉన్నాయని, ఈ పండును తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే పైనాపిల్ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నప్పటికీ, కొందరికి పైనాపిల్ ఆనారోగ్య సమస్యలు కూడా తెచ్చి పెడుతుంది.
పైనాపిల్ పండు తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే పైనాపిల్ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నప్పటికీ, కొందరికి పైనాపిల్ ఆనారోగ్య సమస్యలు కూడా తెచ్చి పెడుతుంది.
పైనాపిల్ పండులో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. చాలా మంది ఈ పండులో ఉన్న తీపి మరియు పుల్లని రుచిని ఇష్టపడతారు. అలాగే, ఇది విటమిన్ సి ఖనిజాల యొక్క అద్భుతమైన మూలంగా పరిగణిస్తారు. పైనాపిల్‌లోని బ్రోమెలైన్ ఎంజైమ్ జీర్ణక్రియకు సహాయపడుతుంది.
పైనాపిల్ పండులో విటమిన్ బి6, ఫోలేట్, మాంగనీస్, కాపర్, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉన్నాయని, ఈ పండును తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే.. పైనాపిల్ తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నప్పటికీ, కొంత మంది మాత్రం దానికి దూరంగా ఉండటానికే ఇష్టపడుతున్నారు.
పైనాపిల్‌లో సహజ చక్కెరలు మరియు కేలరీలు అధికంగా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని తీసుకుంటే, రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణిస్తుంది.
పైనాపిల్ తీసుకోవడం వల్ల కడుపులో అల్సర్ లేదా ఎసిడిటీ సమస్యలు ఉన్నవారికి సమస్యలు వస్తాయి. పైనాపిల్ తీసుకోవడం ద్వారా వారి సమస్యలు తీవ్రమవుతాయి. ముఖ్యంగా రాత్రి పూట పైనాపిల్ తినడం మంచిది కాదు.
రోజుకు విటమిన్ సి గరిష్ట పరిమితి 200 మి.గ్రా. కిడ్నీ సమస్యలు ఉన్నవారికి విటమిన్ సి ఎక్కువగా తీసుకోవడం హానికరం. కాబట్టి కిడ్నీలు పాడవకుండా కాపాడుకోవాలంటే మితంగా తీసుకోవడం మంచిది.