Category : ఆరోగ్యం | Sub Category : ఆరోగ్యం Posted on 2024-11-13 10:58:36
TWM News:-అల్పాహారం తీసుకోని వారికి గుండెజబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అల్పాహారం మానేసే పురుషులకు గుండెపోటు వచ్చే ప్రమాదం 27 శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
ఈ రోజుల్లో హైపర్‌టెన్షన్ అనేది చాలా సాధారణ సమస్య. ఈ సమస్య ఇప్పుడు వృద్ధుల్లోనే కాదు యువతలో కూడా పెరుగుతోంది. అనారోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహారం తీసుకోకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ఊబకాయం మొదలైనవి దీనికి ప్రధాన కారణాలు. అయితే జీవనశైలిని మెరుగుపరచుకోవడం ద్వారా దీన్ని చాలా వరకు నియంత్రించవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ సమస్య ఎక్కువ కాలం కొనసాగితే గుండెపోటు వచ్చే అవకాశం ఉంది.
అధిక రక్తపోటును నియంత్రించడానికి, మీరు మీ జీవనశైలిని మార్చుకోవడం ద్వారా దానిని తగ్గించవచ్చు. అతి ముఖ్యమైన విషయం అల్పాహారం. ఇది మీ రక్తపోటును నేరుగా ప్రభావితం చేస్తుంది. అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన భోజనం. తాజా అధ్యయనం ప్రకారం, అల్పాహారం తీసుకోని వారికి అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బ్రేక్‌ఫాస్ట్‌ను ఎప్పుడూ స్కిప్ చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీరు ఇప్పటికే అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లయితే పోషకమైన అల్పాహారం తీసుకోవాలి.
ఆరోగ్యకరమైన అల్పాహారం తినడం వల్ల మీ గుండె మరింత సమర్థవంతంగా పనిచేయడానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఇది మీ రక్తపోటును కూడా మెరుగుపరుస్తుంది.
అల్పాహారం తీసుకోని వారికి గుండెజబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అల్పాహారం మానేసే పురుషులకు గుండెపోటు వచ్చే ప్రమాదం 27 శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
అల్పాహారం మానేసిన పురుషులకు గుండెపోటు, ఊబకాయం, అధిక రక్తపోటు, బయోకొలెస్టెరోలేమియా మరియు మధుమేహం వచ్చే అవకాశం ఉంది. దీని వల్ల మరణాలు కూడా సంభవిస్తున్నాయి.