Responsive Header with Date and Time

జలుబు, దగ్గుతో బాధపడుతున్నారా..? అయితే, నో టెన్షన్.. ఇలా చేస్తే వెంటనే రిలీఫ్..

Category : ఆరోగ్యం | Sub Category : ఆరోగ్యం Posted on 2024-11-13 10:46:41


జలుబు, దగ్గుతో బాధపడుతున్నారా..? అయితే, నో టెన్షన్.. ఇలా చేస్తే వెంటనే రిలీఫ్..

TWM News:-శీతాకాలంలో అనేక అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి.. ముఖ్యంగా జలుబు, దగ్గు లక్షణాలను ప్రతిఒక్కరూ ఎదుర్కొంటారు.. అయితే.. జలుబు, దగ్గు మందులతో మాత్రమే కాకుండా ఇంటి నివారణలతో కూడా నయం చేయవచ్చు. ముక్కు కారటం, గొంతులో కఫంతో ఇబ్బంది పడుతుంటే కొన్ని ఇంటి చిట్కాలతో వదిలించుకోవచ్చు..

శీతాకాలం వచ్చేసింది.. ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది.. ముఖ్యంగా చలికాలంలో జలుబు, దగ్గు అనేది సాధారణ సమస్యగా మారుతుంది.. దాదాపు ప్రతి వ్యక్తి సంవత్సరానికి ఒకసారి జలుబు, దగ్గు వంటి లక్షణాలను ఎదుర్కోవలసి ఉంటుంది.. చల్లని వాతావరణం గాలిలో తేమ – వాయు కాలుష్యం కారణంగా చాలా మంది అలసటతోపాటు అనేక శారీరక సమస్యలతో బాధపడుతుంటారు. ముఖ్యంగా ముక్కు కారటం, గొంతులో కఫం, దగ్గు, ముక్కు మూసుకుపోవడం లాంటి సమస్యలను ఎదుర్కొంటారు..

జలుబు – దగ్గును మందులతో నయం చేయగలిగినప్పటికీ.. ఇంటి నివారణలతో కూడా చాలా త్వరగా వదిలించుకోవచ్చు. మీరు జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతుంటే, ఇక్కడ కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ను ట్రైచేయడండి.. ఇవి మీ లక్షణాలను తగ్గించడమే కాదు.. త్వరగా ఉపశమనాన్ని కలిగిస్తాయి..

జలుబు – దగ్గు నుంచి ఉపశమనం కలిగించే బెస్ట్ హోమ్ రెమిడీస్..

అల్లం – తేనె: అల్లంలో యాంటీబయాటిక్, యాంటీవైరల్ లక్షణాలు ఉన్నాయి. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. తేనె గొంతు మంటను, దగ్గును తగ్గిస్తుంది. అటువంటి పరిస్థితిలో, ఒక కప్పు గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ అల్లం రసం.. ఒక టీస్పూన్ తేనె కలపండి. దీనిని రోజుకు రెండు మూడు సార్లు తీసుకుంటే.. దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.

తులసి – నల్ల మిరియాలు: తులసి సహజ యాంటీబయాటిక్ లక్షణాలను కలిగి ఉంది.. నల్ల మిరియాలు దగ్గును తగ్గించడంలో సహాయపడతాయి. అటువంటి పరిస్థితిలో.. ఒక కప్పు గోరువెచ్చని నీటిలో కొన్ని తులసి ఆకులు, 2-3 ఎండు మిరియాలు వేసి మరిగించి, దానిని వడపోసి త్రాగాలి. ఇలా చేస్తే.. దగ్గు, గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

వేడి నీటి ఆవిరి: జలుబు, దగ్గుతో పాటు, ముక్కు దిబ్బడ సమస్య కూడా తరచుగా సంభవిస్తుంది. అటువంటి పరిస్థితిలో, ఆవిరిని తీసుకోవడం ముక్కు తెరుచుకోవడంలో.. ముక్కుదిబ్బడ నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది. దీని కోసం, ఒక పెద్ద గిన్నెలో నీటిని తీసుకుని బాగా మరిగించండి.. ఆ తర్వాత పసుపు వేసి.. ఆవిరి పట్టండి. ఇలా కొన్ని నిమిషాల పాటు ఆవిరి పట్టడం వల్ల.. ఇది ముక్కును క్లియర్ చేయడమే కాకుండా గొంతులో వాపును తగ్గిస్తుంది.. దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

పసుపు పాలు: జలుబు, దగ్గు చికిత్సలో పసుపు పాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ఒక గ్లాసు వేడి పాలలో అర టీస్పూన్ పసుపు వేసి బాగా కలిపి నిద్రపోయే ముందు తాగాలి. ఇది గొంతుకు ఉపశమనాన్ని కలిగిస్తుంది.. శరీరం రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది. ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఇన్ఫెక్షన్ ను దూరం చేస్తాయి.

నిమ్మ – వేడి నీరు: నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వేడి నీళ్లలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందడమే కాకుండా జలుబు, దగ్గు సమస్య కూడా తగ్గుతుంది. లెమన్ టీ లేదా లెమన్ హాట్ వాటర్ ను సిప్ చేస్తూ తాగితే.. ఈ సమస్య నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)


Search
Categories
తాజా వార్తలు
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: