Category : జాతీయ | Sub Category : రాజకీయం Posted on 2024-11-13 10:45:28
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కి సంబంధించి నాలుగు తరాలు వచ్చినా సరే, జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించడం సాధ్యం కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తమర్‌లో అమిత్ షా మాట్లాడారు. కాంగ్రెస్ మునిగిపోయే పడవ అని, అందులో ప్రయాణిస్తున్న రaార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను ఆ పార్టీ కాపాడలేదన్నారు. జేఎంఎం` కాంగ్రెస్ ఆదివాసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయి తప్ప, వారిని గౌరవించడం లేదని ధ్వజమెత్తారు. జేఎంఎం సారథ్యంలోని కూటమికి ఓటు బ్యాంకుగా ఉన్న చొరబాటుదారుల కారణంగా ఆదివాసీ జనాభా అంతరించిపోతోంది. బంగ్లాదేశీ చొరబాటుదారులను హేమంత్ సోరెన్ ప్రోత్సహిస్తున్నారు. ఇండియా కూటమి రaార్ఖండ్‌ను ధ్వంసం చేసింది. బీజేపీ అధికారంలోకి వస్తే వచ్చే ఐదేళ్లలో అత్యంత సంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే, యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు అన్నారు.